YS Jagan: వాలంటీర్ వ్యవస్థ రద్దైందా.. ఉందా.. జగన్ రెచ్చగొట్టే కామెంట్ల వెనుక అసలు నిజాలివే!

YS Jagan: ఏపీలో వాలంటీర్ల వివాదంలో సీఎం జగన్ ప్రతిపక్షాలను బాగా ఇరికించే ప్రయత్నం చేశారు. కానీ.. ఇప్పుడే అసలు రంగు బయటపడుతోంది. ఇటీవల పింఛన్ అందుకోవడానికి సచివాలయానికి వెళ్లిన వడదెబ్బతో చాలా మంది వృద్దులు చనిపోయారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టీడీపీ చర్యల మూలంగానే చావులు అని వైసీపీ ఆరోపించింది. వాలంటీర్లు లేకపోవడం వల్లే పింఛన్ల పంపిణీ నిలిచిపోయిందని చెబుతోంది. అందుకు కారణం, చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆరోపిస్తున్నారు. వైసీపీ ఆరోపణలను టీడీపీ నేతలు గట్టిగానే తిప్పికొట్టారు. పింఛను మరణాలను కారణం సీఎం పేషీలోని ధనుంజయరెడ్డితో పాటు ఫైనాన్స్ సెక్రటరీ అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయినందునే పింఛన్లు అందించలేకపోయారని విమర్శిస్తున్నారు. పింఛన్ల పంపిణీ తేదీ ముందే తెలిసినా ఎందుకు డబ్బులు డ్రా చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్నికల ముందు క్షేత్రస్థాయిలో దీని ప్రభావం కచ్చితంగా ఏదో ఒక పార్టీపై పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదంత పక్కన పెడితే సీఎం జగన్ తన ప్రతీ మీటింగ్ లోనూ వాలంటీర్లకు సంబంధించి ఫైల్ పైనే తన తొలి సంతకం పెడతానని చెబుతున్నారు. కొత్తగా ఫైల్ పై సంకతం పెట్టడానికి అసలు వాలంటీర్లను ఎవరు తొలిగించారు? ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలు టీడీపీ నేతలు వాలంటీర్లను తొలగించాలని ఫిర్యాదు చేయలేదు. పింఛన్ పంపిణీకి మాత్రమే దూరంగా ఉండాలని ఫిర్యాదు చేశారు. ఈసీ కూడా ఈమేరకే చర్యలు తీసుకుంది. పింఛన్ పంపిణీకి దూరంగా ఉండాలని ఆదేశించింది. కానీ, జగన్ మాత్రం ఈ మధ్య పదే పది వాలంటీర్ల ఫైలుపై తొలి సంతకం అని చెబుతున్నారు. అంటే వాలంటీర్లను ప్రభుత్వం తొలగించిందా? అనేది అనుమానంగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వాధినేతగా ఉన్న సీఎస్ దీనికి సమాధానం చెప్పాలి. సీఎం జగన్ పదేపది ఇన్ని సార్లు అదే కామెంట్ చేస్తుంటే.. సీఎస్ ఎందుకు మౌనంగా ఉన్నారనేది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై ఎలక్షన్ కమిషన్ అయినా చొరవ తీసుకోవాలి. సీఎం జగన్ కామెంట్స్ వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటీ అని తేల్చాలి.

ఇక్కడ ఇంకో అనుమానం కూడా తలెత్తుతుంది. జగన్ కామెంట్స్ ప్రకారం వాలంటీర్లను తొలగించినట్టే కానీ.. కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు ఎందుకు రాజీనామా చేస్తున్నారా? తొలగించి ఉద్యోగాలకు రాజీనామాలు ఎందుకు? పైగా వైసీపీ నేతలే కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లపై ఒత్తిడి చేస్తున్నారు. వాలంటీలర్లను తొలగిస్తే.. మళ్లీ ఈ రాజీనామాల నాటకం ఏంటీ అనే ప్రశ్నల తలెత్తుతోంది. అసలు వాలంటీర్ల విషయంలో ఏం జరుగుతుందని.. సీఎస్ అయినా చెప్పాలి. లేదంటే.. ఈసీ అయినా చొరవ తీసుకొని నిజాలు నిగ్గు తేల్చారు. వాలంటీర్లు ప్రస్తుతం ఉద్యోగులుగా ఉన్నారా? లేదంటే వారికి తొలగించారా? అనే తేలాల్సి ఉంది.

ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి మాత్రం వాలంటీర్లను తొలగించాలని ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వ పథకాల పంపిణీకి వారి సేవలను వాడకూడదని మాత్రమే చెప్పారు. అందుకే చంద్రబాబు స్పష్టంగా మరో విషయం కూడా చెబుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేదే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు… ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి జీతం పది వేలు చేస్తామని హామీ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -