Prema: ప్రేమ వద్దంటేనే అరుంధతి అవకాశం ప్రేమకు వచ్చిందా?

Prema: ధర్మచక్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్నటువంటి నటి ప్రేమ అనంతరం దేవి సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు.ఇలా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగులో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ప్రేమ అతి కొద్ది సమయంలోనే హీరోయిన్గా ఇండస్ట్రీకి దూరమయ్యారు. హీరోయిన్గా అవకాశాలు కోల్పోవడంతో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.

ఇక ప్రస్తుతం పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో వస్తున్న నేపథ్యంలో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే మంచి కథ ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరికితే తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని తెలిపారు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రేమ అరుంధతి సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.దర్శకుడు కోడి రామకృష్ణ గారితో తనకు చాలా మంచి అనుబంధముందని ఆయనే తనకు తెలుగు నేర్పించారని తెలిపారు.

ఈ క్రమంలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమా అవకాశం ముందు తనకే వచ్చిందని ఈ సందర్భంగా ప్రేమ తెలియజేశారు. కోడిరామకృష్ణ గారు నన్ను సంప్రదించి అరుంధతి కథ వినిపించి కొన్ని రోజులు వరుసగా కాల్ షీట్స్ తనకు కావాలని చెప్పారు. అయితే ఆ సమయంలో తాను కన్నడ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాను.ఇలా డేట్స్ అడ్జస్ట్ గాని పక్షంలో అరుంధతి సినిమాని వదులుకోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ప్రేమ తెలిపారు.

ఇక అరుంధతి సినిమా అనుష్క చేసిన తర్వాత సినిమాని చూశాను నాకు చాలా బాగా నచ్చింది.అయితే ఈ సినిమాని వదులుకున్నానే అనే బాధ నాకు ఏమాత్రం లేదని ఈ సినిమాలో నటించాలని అనుష్కకు రాసిపెట్టి ఉండటం వల్ల ఈ అవకాశం తనకే వెళ్ళింది అంటూ ఈ సందర్భంగా ప్రేమ తెలిపారు. ఇక తనకు సినిమాలలోకి రావాలని ఏమాత్రం ఇష్టం ఉండేది కాదని తనకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలనీ కోరికగా ఉండేది కానీ తన తల్లికి మాత్రం తనని ఓ నటిగా చూడాలన్న కోరిక ఉండడంతో తన తల్లి కోరిక తీర్చడం కోసమే ఇండస్ట్రీలోకి వచ్చానని ప్రేమ తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -