24 సార్లు ‘అరుంధతి’ సినిమా చూసి సూసైడ్‌

Crime News: ఒకొక్కరికి సినిమా పిచ్చి ఒక్కోలా ఉంటుంది. తమ ఇష్టమైన హీరో, హీరోయిన్‌ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయంటే వారి ఆనందానికి హద్దులే ఉండవు. కొందరైతే తన ఇష్టమైన హీరో సినిమా రిలీజ్‌ అవుతున్నాయంటే సొంత డబ్బులతో ఫ్రెండ్స్‌కి మరీ టికెట్లు ఇప్పించి సినిమా చూపిస్తుంటారు. రిలీజ్‌ రోజు ఆయా సినిమా థియోటర్ల వద్ద రూ. వేలల్లో ఖర్చుచేసి ఫ్లెక్సీలు, కకౌట్లు పెడుతుంటారు. మరి కొందరు సినిమాల్లో చూపించిన విధంగా ప్రవర్తిస్తూ తమ ప్రాణాలు కోల్పోతున్నారు.

అలాంటి ఘటనే కర్ణాటకలోని తుంకూరు జిల్లా మధుగిరి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. మధుగిరికి చెందిన రేణుకా ప్రసాద్‌ (23) అనే యువకుడు ఇంటర్‌ వరకు చదువు మధ్యలోనే ఆపేశాడు. కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి సినిమాకు అట్రాక్ట్‌ అయ్యాడు. ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు ఏకంగా ఆ సినిమాను 24 సార్లు వెంట వెంటనే చూశాడు. ఆ సినిమాల్లో విలన్‌గా నటించిన సోనూసూద్‌(పశుపతి)ను చంపేందుకు ఆయుధం తయారు చేసేందుకు హీరోయిన్‌ అనుష్కా(జేజేమ్మ) తన ప్రాణాలను బలి తీసుకుంటుంది.

ఈ సీన్‌ మాత్రం రేణుకా ప్రసాద్‌ను చాలా ప్రభావితం చేసింది. పదే పదే ఆ సీన్‌ను రిపీట్‌ చేస్తూ చూస్తూ ఉండేవాడు. ప్రాణాలు బలితీసుకుంటే స్వేచ్ఛ పొందుతారని భావించాడు. తాను కూడా సినిమాలో చూపించిన విధంగా తన ప్రాణాలు బలితీసుకుంటే తాను స్వేచ్ఛ పొందుతానని భావించి పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో 20 లీటర్ల పెట్రోల్‌ తీసుకుని ఊరికి దూరంగా వెళ్లి పెట్రోల్‌ అంతా ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు.
ఆ మంటల వేడికి తట్టుకోలేక కేకలు వేయడంతో అటుగా వెళ్లే వారు గుర్తించి ఎలాగో మంటలను ఆర్పి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైదం చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విక్టోరియా ఆస్పత్రికి తరించాలనే సూచన మేరకు అక్కడికి తరలించి వైద్యం చేస్తుండగా చికిత్స పొందుతూ రేణుకా ప్రసాద్‌ తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. సినిమాను సినిమాలాగే చూడాలని దాన్ని మనపై ప్రభావితం అయ్యేలా చేసుకోవద్దని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -