Sharmila-Jagan: ఆ ఆస్తులు షర్మిలకు ఇవ్వడానికి సీఎం జగన్ అంగీకరించారా?

Sharmila-Jagan: ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గతంలో జగన్ ఫ్యామిలీ లో జరిగిన సీక్రెట్ లను బయట పెట్టిన విషయం తెలిసిందే. రాధాకృష్ణ జగన్ ఫ్యామిలీలో జరిగిన మరొక సీక్రెట్ ని బయట పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. జగన్ తన చెల్లి షర్మిల తో రాజీకీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు రాధాకృష్ణ. కాగా ఇప్పటికే జగన్ సూచనలతో సజ్జల రామ కృష్ణారెడ్డి హైదరాబాద్ వెళ్లి విజయమ్మతో సమావేశం అయ్యారని అక్కడ జగన్ చెప్పిన విషయాలు చెప్పారని అంటున్నారు.

గతంలో జరిగిన చర్చల్లో షర్మిలకు కోన్న ఆస్తులు ఇస్తామన్న జగన్ మొదట అంగీకరించినా ఇప్పటి వరకూ ఇవ్వలేదట. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇస్తాననే ప్రతిపాదన మొదలు పెట్టారని చెబుతున్నారు. కానీ వీటిపై విజయమ్మ లేదా షర్మిల ఎలా స్పందించారన్నది మాత్రం చెప్పలేదు. ఓటమి భయంతో జగన్ తాను దూరం చేసుకున్న వారందర్నీ ఇప్పుడు దగ్గర చేసుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారని ఆర్కే తెలిపారు. ఈ వారం జగన్ ఫ్యామిలీలో జరుగుతున్న మరో కొత్త విషయం బయట పెట్టాలనుకోవడం ఆసక్తికరంగా మారింది.

 

అయితే ఆస్తులు మాత్రమే కాదనివివేకా హత్య కేసు కూడా జగన్, షర్మిల మధ్య దూరం పెరగడానికి కారణం అన్న అనుమానాలు ఉన్నాయి. వైఎస్ జగన్ ఫ్యామిలీలో ఇన్ సైజ్ ఏం జరిగిందో ఆర్కే చెబుతున్నారు. కాగా గతంలో వైఎస్ వివేకా హత్య గురించి నలుగురికి జగన్ తెల్లవారు జామున నాలుగించే చెప్పారని చెప్పారు. దానిపై వైసీపీ వాళ్లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మామూలుగా అయితే బూతులతో విరుచుకుపడాలి. కానీ ఆర్కే ని తప్పుగా మాట్లాడితే మళ్ళీ జగన్కు సంబంధించిన విషయాలు బయట పెడతారేమో అని భయంతో ఏమీ అనలేదు అన్నట్టుగా కూడా తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -