CM Ramesh: అలా సాయం చేయడం వల్లే ఆయనకు మంత్రి పదవి దక్కిందా?

CM Ramesh: టీడీపి నుంచి బీజేపీ లోకి వచ్చిన ముగ్గురు నాయకులలో బీజేపితో మింగిల్ అయిపోయి వాళ్ళ దృష్టిలో మంచి వేరు తెచ్చుకున్న నాయకుడు మాత్రం సీఎం రమేష్ అనే చెప్పాలి. టీజీ వెంకటేష్ సృజన చౌదరి బిజేపిలో అంతగా మింగిల్ కాలేకపోయారు. సీఎం రమేష్ మాత్రం సోషల్ మీడియాలో..

 

యాక్టివ్ గా ఉంటూ పార్టీ కార్యక్రమాలు విధానాలు షేర్ చేస్తూ అధిష్టానం దగ్గర బాగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. అదే ఇప్పుడు బీజేపి పెద్దల అనుగ్రహం కలగటానికి కారణం అయింది. ఇటు జేపీ నడ్డా ఆశీస్సులతోపాటు అమిత్ షా దగ్గర మంచి పేరు కూడా సంపాదించడానికి మార్గం సులువైంది.

అందుకే ఈసారి సీఎం రమేష్ కి మంత్రివర్గంలో చోటు ఇస్తారని మాట బలంగా వినబడుతుంది. ఏపీలో అసలు బీజేపికి ఎంపీలే లేరు. పార్టీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు ఉన్నప్పటికీ ఆయన యూపీ కోటాలో ఎంపీ ని చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించడానికి బీజేపి ప్లాన్ చేస్తోంది.

 

జనవరి 29 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ లోగానే మంత్రివర్గాన్ని విస్తరించడానికి బీజేపి ప్లాన్ చేస్తుంది. ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో వాటికి తగినట్లు కేంద్ర క్యాబినెట్ టీంలో కొన్ని మార్కులు చేర్పులు అవసరం అని బీజేపి భావిస్తుంది.

 

పార్టీ అవసరాలు వ్యూహాలు ప్రకారం కొందరినీ రాష్ట్రాలకి పంపించడం రాష్ట్రాల నుంచి కొందరిని కేంద్ర మంత్రులుగా తీసుకురావడం వంటి మార్పులు చేర్పులు చేయటంతో పాటు మిగిలిన ఐదు క్యాబినెట్ మినిస్టర్ ఖాళీలను కూడా భర్తీ చేసి క్యాబినెట్లో ఎన్నికలకి వెళ్లాలని మోదీ ప్లాన్.

 

మొన్నటి కర్ణాటక ఎన్నికల సమయంలో బయటకి కనిపించినప్పటికీ సీఎం రమేష్ పార్టీకి ఆర్థికంగా తన వంతు సాయం చేశారని.. అమిత్ షా జె పి నడ్డా విశాఖపట్నం వచ్చినప్పుడు ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి ఆహ్వానం పలికారు. కోట్లు ఖర్చుపెట్టి వారి సభకు ప్రచారం కల్పించారు. అలా చేయడం వలనే ఆయనకి మంత్రి పదవికి నామినేట్ చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -