CM Ramesh: కాంగ్రెస్ ఖాతాలోకి రూ.30 కోట్లు పంపిన సీఎం రమేష్.. చెప్పినట్టు ఆడటానికే ప్యాకేజీ డబ్బులు పంపారా?

CM Ramesh: తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేరువేరు కాదని కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు అంటూ ఇటీవల ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అయితే ఇది నిజమేనని తాజాగా సీఎం రమేష్ కాంగ్రెస్ ఖాతాలోకి 30 కోట్ల రూపాయలు పంపినట్టు ఎలక్టోరల్ బాండ్లు తేట తెల్లం చేశాయి. 2019 వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు సీఎం రమేష్ ను బిజెపి పార్టీలోకి పంపించిన సంగతి తెలిసిందే. ఇలా అప్పటినుంచి బిజెపి పార్టీలో ఉన్నటువంటి సీఎం రమేష్ అనధికారకంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది.

ఇక ఈయన తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ కి 30 కోట్ల రూపాయలు ఫండ్ పంపించడంతో ఈ రెండు పార్టీలు ఒక్కటేనని స్పష్టమైనది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం రమేష్ రిత్విక్ ప్రాజెక్ట్ సంస్థలను స్థాపించి అతి తక్కువ సమయంలోనే వేల కోట్ల అధిపతి అయ్యారు. ఇక ఈయన ముఖ్యమంత్రిగా ఓడిపోవడంతో సీఎం రమేష్ ను బిజెపిలోకి పంపించారు..ఇలా ఇన్ని సంవత్సరాలు పాటు బిజెపిలో ఉన్నటువంటి సీఎం రమేష్ ఇప్పటివరకు బిజెపికి పార్టీ ఫండ్ తరపున ఒక రూపాయి కూడా ఇవ్వలేదు.

ఇలా బిజెపికి పార్టీ ఫండ్ ఇవ్వకుండా తమ బద్ధ శత్రువు అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఫండ్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తుంది అంతేకాకుండా చంద్రబాబు ఎవరినైతే తన స్వప్రయోజనాల కోసం వాడుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈయన పెద్ద ఎత్తున డబ్బును పంపించడమే కాకుండా వారందరూ తిరగడానికి తన విమానాలను కూడా పంపిస్తూ ఉన్నారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోర్ షర్మిల వంటి వారందరికీ కూడా సీఎం రమేష్ విమానం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలలో ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆయనని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవడం కష్టమని భావించి ఇలా అడ్డుదారులు తొక్కుతూ అన్ని పార్టీలకు లంచాలు ఇస్తూ జగన్ పై తిరుగుబాటుకు సిద్ధం చేశారు.

వైయస్ వివాకానంద రెడ్డి హత్య కేసును అడ్డుపెట్టుకొని ఈయన రాజకీయాలు చేస్తున్నారు.ఈ కేసు విషయంలో తన భర్త దొరికిపోతాడేమోనని భయపడుతున్నటువంటి సునీతను చేరదీశారు అంతేకాకుండా రేవంత్ రెడ్డి సహాయంతో వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి బాబు సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు కడపలో స్వయంగా షర్మిల చేత పోటీ కూడా చేయించబోతున్నారు. ఇలా ఈ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయడానికి ఏకంగా కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఇచ్చి చంద్రబాబు చెప్పినట్లే ఆ పార్టీలన్నీ కూడా వ్యవహరిస్తున్నాయని తాజాగా బయటపడింది.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -