Pawan Kalyan: ఇప్పుడంతా కోడిగుడ్డే.. గుడివాడ అమర్నాథ్ పై పవన్ కళ్యాణ్ సెటైర్లు వేరే లెవెల్!

Pawan Kalyan: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తనపై సెటైర్లు వేస్తూ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ తాను పది సంవత్సరాల పాటు ఒక ఎమ్మెల్యే కూడా లేకపోయినా పార్టీని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్నాను అని తెలిపారు.

నాకు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కానీ పదవులకు ముఖ్యం కాదని నేను మంత్రి అవ్వాలి అనుకుంటే ఎప్పుడో మంత్రి అయ్యే వాడినని పవన్ వెల్లడించారు.టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం రావాలంటే ఒక్క తప్పు కూడా జరగకూడదన్నారు పవన్ కళ్యాణ్. అన్ని శక్తులు కలవాలన్నారు. అందుకే 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకున్నామని పవన్ వివరించారు. అనకాపల్లి పార్లమెంట్ అయినప్పటికీ కేంద్రం సూచనలతో సీఎం రమేష్ కి టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.

మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా కూటమి అధికారంలోకి రావాలని అందుకే సీఎం రమేష్ ను, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈయన కోరారు. ఇక కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగస్తుల కష్టాలని తీరుతాయని ఉద్యోగులకు పెన్షన్ ఎంత అవసరమో తనకు తెలుసని సిపిఎస్ పరిష్కారాన్ని కూడా చేస్తామని పవన్ తెలిపారు.

ఇక మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తొస్తుంది కానీ, ఇప్పుడు అనకాపల్లి కోడి గుడ్డు పేరు వింటున్నాం. కోడి గుడ్డు పెట్టింది. ఇంకా పొదుగుతూనే ఉంది వైసీపీ కోడి. ఈ జిల్లాకు ఒక డిప్యూటీ సీఎంను, ఐదు పోర్టుఫోలియోలకు మంత్రిని, ఒక విప్ ను ఇచ్చింది. అయినప్పటికీ ఒక కిలోమీటర్ రోడ్డు వేయలేకపోయారని తెలిపారు జగన్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం కాదని ఆయన ఒక సారా దొంగ ఇసుక దోపిడీ దారుడు అంటూ జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా పవన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -