Rajini: సీఎం కాళ్లు మొక్కడంతో రజనీ పరువు గంగలో కలిసినట్టేనా.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే?

Rajini: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.ఏడుపదుల వయసులో కూడా ఈయన ఎంతో ఎనర్జిటిక్గా నటించిన జైలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయం అందుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే తాజాగా రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నటువంటి రజనీకాంత్ ఏకంగా వయసులో తన కన్నా సుమారు 20 సంవత్సరాలు చిన్నవాడు అయినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడి నమస్కారం చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

 

ఎంతో ఆత్మ అభిమానం ఉన్నటువంటి తమిళులు తమ సూపర్ స్టార్ ఇలా తనకన్నా వయసులో చిన్నవాడైనటువంటి యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడటం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఇలా ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నటువంటి ఈయన కాళ్లపై ఇతరులు పడాల్సింది పోయి ఈయన ఏకంగా ముఖ్యమంత్రి కాళ్లకు నమస్కారం చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రజినీకాంత్ చేసిన పని పట్ల అభిమానులు కాస్త కోపంతోనే ఉన్నారని చెప్పాలి.

 

ఇకపోతే రజనీకాంత్ ఈ విధంగా యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడటంతో రజినీకాంత్ పరువు పోయింది అంటూ పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. అయితే రజనీకాంత్ తన కాళ్లకు నమస్కారం చేయడం వెనుక అర్థం ఉందని తెలుస్తుంది. రజినీకాంత్ కు భక్తి భావం ఎక్కువ ఆయన జైలర్ సినిమా విడుదలైన తర్వాత కూడా హిమాలయాలకు వెళ్లి ఎంతో మంది యోగులను కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు అయితే యోగి ఆదిత్యనాథ్ కూడా కొన్ని సంవత్సరాల క్రితమే యోగిగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం రజిని ఆకట్టుకోవడంతో ఆయన కారు దిగిన వెంటనే ఆయన కాళ్లపై పడి నమస్కారం చేశారు. అయితే ఈ విషయాన్ని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -