YS Jagan: ఆ ఎమ్మెల్యేకు భారీ షాక్ ఇవ్వడానికి జగన్ సర్కార్ సిద్ధమైందా?

YS Jagan: ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుంచి వేడి మొదలైంది. ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని రాబోయే ఎన్నికల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యే గెలుపు కష్టంగానే ఉంటుంది అంటూ వార్తలు జోరుగా వినిపి.
రజనీకి పార్టీతో పాటు బయట కూడా కొన్ని సమస్యలు తోడవడంతో గతసారి ఎన్నికలలో గెలిచినంత ఈజీగా ఈసారి ఎన్నికల్లో రజిని గెలవడం కష్టం అని ప్రచారాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో రజనీ గెలుపులో ఎక్కువభాగం జగన్ మోహన్ రెడ్డి గాలి బాగా పనిచేసింది.

ఎందుకంటే చిలకలూరిపేట నియోజకవర్గం అంటేనే మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గానికి బాగా పట్టున్న నియోజకవర్గమని పేరు. అలాంటిది బీసీ వర్గానికి చెందిన రజనీ గెలవటమే అన్నది సంచలనం అని చెప్పవచ్చు. అందునా మొదటిసారి పోటీ చేసిన రజనీ బాగా సీనియర్ అయిన టీడీపీ అభ్యర్ధి, అప్పట్లో మంత్రి పత్తిపాటి పుల్లారావును ఓడించటం చాలా పెద్ద విషయం. మొదటిసారి గెలవటమే పెద్ద విషయం అనుకుంటే గెలిచిన రెండేళ్ళల్లోనే మంత్రి అయిపోవటం అదృష్టమనే చెప్పాలి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో మంత్రికి ఏ మాత్రం పడటంలేదు. అలాగే మరో సీనియర్ నేత, ఎంఎల్సీ మర్రి రాజశేఖర్ తో పాటు మంత్రికి పొసగటం లేదు.

 

ఇక వీటితో పాటు చిన్న చిన్న సమస్యలు ఎలాగూ ఉంటాయి. అన్నీ కలిపి మంత్రిపై వ్యతిరేకత పెంచేస్తున్నాయన్నది నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం. మంత్రి దూకుడు స్వభావం కూడా సమస్యగా మారుతోందని పార్టీలోనే చర్చ జరుగుతోంది. అయితే మంత్రి మాత్రం తన పని తాను చేసుకపోతున్నారు. సంక్షేమ పథకాల అమలు, కొన్ని అభివృద్ధి పనులు, జగనన్న కాలనీలే తనను గెలిపిస్తాయని రజనీ ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అసలు రజనీకి టికెట్ దక్కుతుందా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఎంపీయే వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట ఎంఎల్ఏగా పోటీచేయాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారట. నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం ఓట్లు సుమారు 40 వేలుంటాయి. ఎస్సీలు 65 వేలు, వైశ్యుల ఓట్లు 25 వేలు, ముస్లిం ఓట్లు 30 వేలు, రెడ్లు 10 వేల దాకా ఉంటారు. మిగిలిన సామాజికవర్గాల ఓట్లు మరో 70 వేలదాకా ఉంటాయి. రజనీకి టికెట్ దక్కుతుందా, గెలుస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది..

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -