Rajini: ఆ విషయంలో రజనీకి అసూయ అవసరమా.. ఈ వయస్సులో ఇలా చేస్తారా?

Rajini: నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం జైలర్. ఈ సినిమా ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో తమన్నా హీరోయిన్గా నటించింది. అలాగే మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, సునీల్ కీలక పాత్రలో నటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలు పెట్టేశారు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన కావాలయ్యా అనే సాంగ్ యూట్యూబ్ లో ట్రేడింగ్ అవుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా కూడా ఇదే పాట మారుమోగిపోతోంది.

అంతేకాకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ రీల్స్ చేసి అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సాంగ్ విషయంలో రజినీకాంత్ తన అసూయ వ్యక్తం చేశాడు. కావాలయ్యా సాంగ్ దాదాపు ఆరు రోజులు షూట్ చేశారట. నాకు ఒక్క రోజు కూడా షూటింగ్ లో పాల్గొనే అవకాశం రాలేదని అన్నారు. ప్రధానంగా తమన్నా, డాన్సర్స్ మీద ఈ సాంగ్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. కావాలయ్యా సాంగ్ లో రజినీకాంత్ కనిపిస్తారు కానీ వయసు రీత్యా ఆయనతో పెద్దగా డాన్స్ చేయించలేదని తెలుస్తోంది. ఇంత పాపులర్ సాంగ్ లో తనకు పెద్దగా స్పేస్ లేదని రజినీకాంత్ పరోక్షంగా తెలిపారు.

 

ఒక రకంగా చెప్పాలి అంటే ఈ పాట విషయంలో రజనీకాంత్ కాస్త అసూయతో ఉన్నాడని చెప్పవచ్చు
అయితే కావాలయ్యా సాంగ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది తెలుగు లిరిక్స్ తో మొదలవుతుంది. చంద్రముఖి మూవీలో దేవుడ దేవుడా సాంగ్ కూడా తెలుగు పదాలతో మొదలవుతుంది. చంద్రముఖి రజినీకాంత్ కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా ఉంది. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే రజినీకాంత్ కి జైలర్ రూపంలో భారీ విజయం దక్కుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -