Directors: సినిమా డిజాస్టర్ కావడమే ఈ దర్శకుల కెరీర్ కు ఆటంకం అయిందా?

Directors: సినిమా ప్రపంచం అంటేనే మాయా ప్రపంచం. ఇక్కడ హిట్లు సక్సెస్ లు ఉంటేనే మనిషిని మనిషిగా చూస్తారు. లేదంటే ఎంత పేరున్న వ్యక్తులైన ఒక్క ఫ్లాప్ తో తిరుగు ముఖం పట్టాల్సిందే. హిట్ అయితే సినిమా క్రెడిట్ అంతా యూనిట్ మొత్తానిది అనటం ప్లాప్ అయితే తప్పంతా దర్శకుల మీద నెట్టేయ్యటం సినీ పరిశ్రమలో రివాజు అయిపోయింది.

ఇంతకుముందు ఈ నిందకి దర్శకుడు కొరటాల శివ బలయితే రీసెంట్ గా సురేందర్ రెడ్డి కూడా ఆ జాబితాలోనే చేరిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే రీసెంట్ గా విడుదలైన ఏజెంట్ మూవీ రిలీజ్ చెయ్ పెద్ద డిజార్డర్ ని మిగిల్చింది. ఇందుకు కారణం దర్శకుడే అంటూ సురేందర్ రెడ్డి మీదకి నెట్టేసింది చిత్ర యూనిట్.

 

ప్రొడ్యూసర్ సైతం తప్పంతా దర్శకుడిదే అన్నట్టు హీరో తప్పేమీ లేదన్నట్లుగా అఖిల్ ని మెచ్చుకుంటూ మాట్లాడారు. అఖిల్ కూడా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడారు తప్పితే ఎక్కడ దర్శకుడు సురేందర్ రెడ్డి గురించి మాట్లాడకపోవడం విచారకరం. గత ఏడాది ఆచార్య సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కొరటాల శివ ఇదే నిందని ఎదుర్కోవలసి వచ్చింది.

 

చిరంజీవి కొరటాలని ప్రత్యక్షంగానే విమర్శించారు. అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కూడా తప్పంతా కొరటాలదే అన్నట్లుగా మాట్లాడారు.ఒక సినిమా విజయవంతం అవడంలోనూ ఫ్లాప్ అవ్వటంలోనూ ప్రధాన పాత్ర దర్శకుడే అనటంలో తప్పులేదు కానీ తప్పంతా దర్శకుడిదే అనటం మాత్రం న్యాయం కాదు.

 

సినిమా చేస్తున్నప్పుడు టీం అంతా ఏకాభిప్రాయానికి వస్తేనే సినిమా ముందుకి కదులుతుంది. ఏమైనా తేడాలు ఉంటే ఎడిటింగ్ అప్పుడు గాని మేకింగ్ టైం లో గాని మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అన్ని సందర్భాల్లోనే అందరూ పాజిటివ్ గా మాట్లాడి తెర సినిమా రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న తరువాత తప్పంతా దర్శకులతే అనటం పాపం అంటున్నారు నెటిజెన్స్. ఇది వాళ్ళ కెరియర్ కి కూడా ఆటంకం అవుతుంది అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -