Chiranjeevi: ఈ డైరెక్టర్ల కెరీర్ నాశనం కావడానికి చిరంజీవి సినిమాలే కారణమా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినీ పరిశ్రమకే బ్యాక్ బోన్ గా నిలబడిన వ్యక్తి. చిరంజీవికి ముందు సినిమా ఇండస్ట్రీ చిరంజీవికి తరువాత సినిమా ఇండస్ట్రీ అనే పరిస్థితికి తీసుకువచ్చాడు చిరంజీవి. అతనితో సినిమా చేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకునే దర్శకులు ప్రొడ్యూసర్లు ఎంతోమంది ఆయన ఇంటి చుట్టూ క్యూ కట్టేవారు. నిజంగానే చిరంజీవి కూడా ఎంతోమంది డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి లైఫ్ సెటిల్ చేసే సినిమాలు చాలా చేశాడు.

 

హీరోయిన్ లు కూడా చిరంజీవితో చేస్తే వాళ్ళ యొక్క స్టార్ డం అమాంతం పెరిగిపోయేది. అయితే చిరంజీవితో సినిమా చేసిన కొందరు దర్శకులు మాత్రం కెరియర్ పోగొట్టుకొని ఆపై సినిమాలు లేక ఇంట్లో ఖాళీగా కూర్చున్నారు. వాళ్లు ఎవరో ఏ సినిమాలతో కెరియర్ లాస్ అయ్యారో చూద్దాం. మొదటగా వివి వినాయక్ సంగతి చూద్దాం. వివి వినాయక్ అనేసరికి ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరు. ఆయన సినిమాలో నటించిన హీరోకి మాస్ ఇమేజ్ వచ్చి తీరేది. ఆయన సినిమాలో నటించాలని ప్రతి హీరో కలలు కనేవాడు.

అలాంటివి వినాయక్ చిరంజీవితో సినిమా చేసి కెరీర్ పోగొట్టుకున్నాడు. వివి వినాయక్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా చిరంజీవికి మంచి కం బ్యాక్ ఇచ్చింది కానీ వి వి వినాయక్ కి మాత్రం ఎలాంటి ఆఫర్లు రాలేదు. సాయి ధరమ్ తేజ్ తో ఇంటిలిజెంట్ సినిమా తీశాడు కానీ అది కూడా డిసార్డర్ గా మిగిలింది. ప్రస్తుతం ఆయన చేతిలో ఎలాంటి సినిమా లేకపోవడం గమనార్హం. అలాగే హిందీలో చత్రపతి సినిమా తీయగా అది కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

 

అలాగే మరొక దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ చిరంజీవితో సైరా సినిమా అయినా కెరీర్ ని కోల్పోయేలాగా చేసింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఏ హీరో కూడా అతనితో సినిమాలు చేయటానికి ముందుకు రాలేదు. అఖిల్ తో ఏజెంట్ సినిమా చేసినప్పటికీ అది కూడా పెద్ద ఆడిజాస్టర్ అయింది. ఈయన చేతిలో కూడా ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేవని సినీ వర్గాల భోగట్టా.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -