Balakrishna: బాలయ్య కోసం పోటీ పడుతున్న దర్శకులు.. సీనియర్ స్టార్స్ లో ఈ రేంజ్ ఎవరికీ లేదంటూ?

Balakrishna:  నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన తాజాగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న బాలకృష్ణ బుక్ మై షో లో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయన హవా నడుస్తుంది. ప్రతి డైరెక్టర్ ఆయనతో సినిమా తీయడానికి పోటీపడుతున్నారు. ఈ వయసులో ఇంతటి తన విజయాలు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.

ఆఖండ, వీర సింహారెడ్డి ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య టాలీవుడ్ హాట్ టాపిక్ గా మరి టాలీవుడ్ కి మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. యంగ్ జనరేషన్ డైరెక్టర్లు సైతం ఆయన కోసం కథలు రాసుకుంటున్నారు అంటే ఆయన రేంజ్ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ సినిమా తర్వాత ఆయన బాబి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఎన్.బి.కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది.

ఈ సినిమా ఇక బాలయ్య ఎన్.బి.కె 110, ఎన్.బి.కె 111 సినిమాలు ఆల్రెడీ అయిపోయాయి. కమిట్ అవ్వాల్సిన సినిమాల లిస్టు చూస్తే ఎవరికైనా కళ్ళు చెదరాల్సిందే. ఆయన వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎన్.బి.కె 110 బోయపాటి శ్రీను తో ఉంటుందని సమాచారం. అఖండ కి సీక్వెల్ గా ఈ సినిమా ఉండబోతుంది. ఇటీవల బోయపాటి శ్రీను స్కంద మూవీ రిలీజ్ టైం లో ఈ విషయం ఆల్రెడీ చెప్పాడు. ఇక ఎన్ బి కే 111 సినిమా పూరి జగన్నాథ్ లేదా గోపీచంద్ మలినేని తో ఉండబోతుందని సమాచారం.

పూరి జగన్నాథ్ తో మరొక సినిమా చేస్తానని బాలయ్య ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పూరి కూడా బాలయ్య కోసం కధ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే గోపీచంద్ తో ఒక సినిమా ఉంటుందని బాలయ్య ఇప్పటికే వెల్లడించారు. అయితే 111 ఎవరి కాంబినేషన్లో వస్తుంది అనేది వేచి చూడాలి. ఇక వచ్చే మూడేళ్లలో బాలకృష్ణ డైరీ ఏమాత్రం ఖాళీ లేదు కుర్ర హీరోలకి కూడా ఇంత డిమాండ్ లేకపోవడం గమనార్హం. ఏదేమైనా కింద మీద ఊపు, బాలయ్య బాబు తోపు అంతే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -