Stress: ఒత్తిడి వల్ల శృంగారంలో ఇబ్బందులా.. ఏం చేయాలంటే?

Stress: సాధారణంగా పెళ్లయిన మొదట్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా శృంగారంలో పాల్గొనడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. ఈ సమయంలో వారికి శృంగార కోరికలు కూడా అధికంగానే ఉంటాయి. అయితే కొంతకాలం తర్వాత శృంగారం పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండదు. ఏదో శృంగారంలో పాల్గొనాలి అంటే పాల్గొంటారు తప్ప అనుభూతిని మాత్రం ఆస్వాదించలేకపోతుంటారు. ఇక భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి అన్యోన్యత రొమాన్స్ అనేది కూడా ఉండదు.

పెళ్లి తర్వాత కొంతకాలానికి ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉండడం సర్వసాధారణం అయితే ఇలా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు లేకపోవడం శృంగార జీవితం సరిగా లేకపోవడం అసలు శృంగారంలో పాల్గొనాలని ఆసక్తి కూడా కలగకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.శృంగారంలో పాల్గొనాలి అనే కోరికలు కలగాలి అంటే మన శరీరంలో మహిళలలో అయితే ఈస్ట్రోజన్ పురుషులలో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్లు విడుదల కావాలి.

ఇక ఈ హార్మోన్ల స్థాయి ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఆ సమయంలో శృంగారంపై ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అయితే ఈ హార్మోన్లు విడుదల ఎప్పుడు తగ్గిపోతుంది అంటే ఎప్పుడైతే మనం అధిక ఒత్తిడి మానసిక సంఘర్షణకు గురవుతామో ఆ సమయంలో హార్మోన్లో ఉత్పత్తి అనేది పూర్తిగా తగ్గిపోతుంది మనం ప్రతిరోజు అధిక పని ఒత్తిడి కారణంగా ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఉంటాము.

ఇలా అధిక ఒత్తిడికి గురైన సమయంలో మన శరీరంలో ఈ హార్మోన్ల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది.ఇలా హార్మోన్ల ఉత్పత్తి తగ్గినప్పుడు శృంగారంలో పాల్గొనాలని కోరికలు కూడా తగ్గుతాయి అందుకే మనం ముందుగా మనలో ఏర్పడే ఒత్తిడిని ఆందోళనలను నిరాశను పక్కనపెట్టి కాస్తా ప్రశాంతకరమైన జీవితాన్ని గడపడం కోసం ప్రయత్నించాలి. ఎప్పుడు పని మీదే ధ్యాస కాకుండా కాస్త మన వ్యక్తిగత జీవితంపై కూడా దృష్టి పెట్టినప్పుడే శృంగారంలో పాల్గొనాలనే కోరికలు కూడా కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -