Fish: అది మెరుగుపడాలంటే చేపలను ఇలా తినాలి

Fish: చేపలలో కనిపించే ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు కొన్ని హార్మోన్ల ఉత్పత్తి లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా రక్తం గడ్డకట్టడం, ధమని గోడ సంకోచం, సడలింపు, వాపు వంటి సమస్యలకు ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు తోడ్పడతాయి. అవి మెదడు లోని ధమనులకు సపోర్టు చేస్తాయి. మెదడు ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారాన్ని తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఆహారం వల్ల మెదడు పనితీరు చురుకుగా ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో చేపలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

చేపలను తినడం ద్వారా మెదడు యొక్క లెర్నింగ్, హిప్పోకాంపస్‌ పరిమాణాన్ని కూడా పెంచుకోవచ్చు. మతిమరుపును నిరోధించవచ్చు. మెదడు ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా చేపలను తినడం ద్వారా, వృద్ధు్ధలు జ్ఞాపకశక్తిని కోల్పోకుండా నిరోధించవచ్చు. ఆహారంలో చేపలను క్రమం తప్పకుండా తింటే మెదడుకు సంబంధించి కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

సెరెబ్రోవాస్కులర్‌ వ్యాధి ఇది గుండె జబ్బుల తర్వాత ప్రపంచంలో మరణానికి రెండవ ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. మెదడులోని రక్త ప్రసరణ మరియు రక్తనాళాల పనితీరును ప్రభావితం చేసే వివిధ ఆరోగ్య సమస్యలు దీని కారణంగా తలెత్తుతాయి. సెరెబ్రోవాస్కులర్‌ వ్యాధి అభిజ్ఞా బలహీనతకు మాత్రమే కాకుండా శారీరక వైకల్యానికి కూడా కారణమవుతాయి. అదృష్టవశాత్తూ, చేపల వంటి కొన్ని ఆహారాలు తినడం వల్ల ఇలాంటి పరిస్థితిని నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి ఒకసారి చేపలు తినడంతో హిప్పోకాంపస్‌ 14 శాతం పెరుగుతుంది. ఇది మీ అభిజ్ఞా క్షీణత, చిత్తవైకల్యం మరియు అల్జీమర్స్‌ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి దారితీస్తుంది.

మెదడు ఆరోగ్యం కోసం చేపలను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకోవడంలో వేగం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళనలు, మూడ్‌ స్వింగ్స్‌తో బాధపడే గర్భిణులు సీఫుడ్‌ ఎక్కువగా తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి చేపల్లో అధికంగా ఉండే ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు, డీ–విటమిన్‌ వంటి పోషకాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ ఫ్యాటీ ఆమ్లాలు పుట్టబోయే బిడ్డ మెదడు అభివద్ధికీ దోహదం చేస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -