Vastu shastra: మీ ఇంట్లో బల్లులు ఉన్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

Vastu shastra: సాధారణంగా చాలామంది ఇళ్లల్లో బల్లులు సర్వసాధారణంగా కనబడుతూ ఉంటాయి.ఇలా బల్లులు కనిపించడం వల్ల చాలామంది వాటిని చూడగానే ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు. అయితే బల్లులు ఇంట్లో ఉండడం వల్ల కొన్ని శుభ పరిణామాలు కొన్ని అశుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.మరి బల్లి ఇంట్లో కనిపించడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అసలు బల్లి శుభానికి సంకేతమా లేదా అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా మన ఇంట్లో అన్ని చోట్ల బల్లులు కనబడుతూ ఉంటాయి. కానీ తరచూ దేవుని గదిలో కనుక బల్లి కనిపించింది అంటే అది లక్ష్మీదేవి రాకకు సూచన అని పురాణాలు చెబుతున్నాయి. బల్లి తరచు మనకు దేవుడి గదిలో కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని అర్థం.అలా కాకుండా మన ఇంట్లో బల్లి చనిపోయినట్టు కనక కనపడితే అది ఆశుభానికి సంకేతం. చనిపోయిన బల్లి కనబడితే కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారని అర్థం.

 

ఇక మీరు కొత్త ఇంట్లో చేరేటప్పుడు లేదా కొత్తగా ఏదైనా దుకాణం ఏర్పాటు చేస్తున్న సమయంలో బల్లి నేలపై వెళ్ళేది కనుక కనపడితే అది కూడా ఆశుభానికి సంకేతం అలాంటి సమయంలో పూజ చేసుకుని ప్రవేశించడం ఎంతో మంచిది.ఇక రెండు బల్లులు పోట్లాడుకోవడం మనం ఎప్పుడైనా చూసాము అంటే అది కూడా కుటుంబ సభ్యుల మధ్య గొడవకు కారణం అని చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు సంభవిస్తాయని అర్థం.

 

ఇక రాత్రిపూట మనం నిద్రపోయే సమయంలో కొన్నిసార్లు బల్లులు పట్టుకోల్పోయి కింద పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కుడి వైపు కనుక బల్లి మీద పడితే త్వరలోనే మీరు ప్రయాణం చేస్తారని ఆ ప్రయాణం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుందని అర్థం అలా కాకుండా ఎడమవైపు బల్లి పడితే ఇంట్లో సమస్యలు వస్తాయని అర్థం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -