Best Direction to Sleep: అటువైపు తలపెట్టి నిద్రపోతే మీకు అన్ని శుభాలే!

Best Direction to Sleep: చాలా మంది వాస్తు, శాస్త్రలను నమ్ముతారు. నూతన ఇంటిని నిర్మించాలన్నా.. ముందుగా జ్యోతిష్యులను సంప్రదించి వారు చెప్పిన వాస్తు ప్రకారమే నిర్మిస్తారు. అయితే.. ఇంట్లో పెట్టే వస్తువులు, నిద్రించే పద్ధతి కూడా వాస్తు ప్రకారమే ఉండాలంటరు. పడుకునే సమయంలో తల ఆ దిక్కు పెట్టుకొని పడుకోరాదు.. కాళ్లు అటువైపు చాప కూడదంటారు.అయితే నిద్రించేటప్పుడు మీరు ఏ దిక్కులో నిద్రిస్తున్నారనేది కూడా చాలా ముఖ్యమట. నిద్రించే దిశ వల్ల తప్పుగా ఉంటే మీరు ప్రశాంతత కోల్పోవడమే కాదు తరచూ అనారోగ్యాలు, కుటుంబంలో కలహాలు వస్తాయట.

వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో తల పెట్టి నిద్రించడం చాలా శుభప్రదం. ఆ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల మానసిక సమస్యలు దూరం అవుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందట. దక్షిణం వైపు పాదాలను పెట్టి నిద్రపోకూడదు. అది అశుభం. మన పాదాలను దక్షిణం వైపు పెట్టి పడుకోవడం వల్ల మనలో రక్త హీనత ఏర్పడుతుందని వాస్తు శాస్త్రం అంటోంది. దక్షిణం వైపు తల పెట్టి నిద్రించలేకపోతే, తూర్పు వైపు తల పెట్టి నిద్రించడానికి ప్రయత్నించండి. దక్షిణం తర్వాత తూర్పు వైపునకు వెళ్లడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం లభిస్తుంది. ఇతర దేవతల ఆశీస్సులు కూడా ఉంటాయని చెబుతారు.

ఇంట్లో ఒంటరిగా సంపాదించే వారు తూర్పు తలపెట్టి పడుకోవడం మంచిదని విశ్వాసం ఇలా చేయడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారట. డబ్బుకు సంబంధించిన సమస్యలను కూడా చాలా వరకు అధిగమించవచ్చని అంటున్నారు వాస్తు పండితులు. చదువుకునే వారు కూడా తూర్పు దిక్కున తల పెట్టి నిద్రించాలి. తూర్పు వైపు తల పెట్టి పడుకోవడంతో చదువుల పట్ల మొగ్గు చూపడంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. చాలా మంది తమ పాదాలను ఆలయం వైపు, ఇంట్లో ఉండే దేవుడి గుడి గదివైపు పెట్టి పడుకుంటారు. ఇలా పడుకోరాదు. ఇలా పడుకుంటే ఇంట్లో అశుభాలు జరుగుతాయని శాస్త్రలు చెబుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -