Ravindar Chandrasekaran: రవీందర్ మహాలక్ష్మికి ఎంత బంగారం ఇచ్చాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Ravindar Chandrasekaran: కొన్ని రోజుల క్రితం తమిళ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్.. తమిళ బుల్లితెర నటి వి.జే మహాలక్ష్మిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరికి సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక రవీందర్ చంద్రశేఖరన్ లిబ్ర ప్రొడక్షన్స్ స్థాపించి ఎన్నో మంచి చిత్రాలను నిర్మించడం జరిగింది.

తాను నిర్మించే రెండు చిత్రాలలో మహాలక్ష్మి నటించడం జరిగింది. అప్పుడే వీరికి పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు. మహాలక్ష్మి కూడా మోడల్ గా, సీరియల్ హీరోయిన్ గా తమిళ ఇండస్ట్రీలో రాణిస్తూ మంచి గుర్తింపు పొంది సినిమాలలో కూడా సహాయక పాత్రలలో నటిస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే రవీందర్.. మహాలక్ష్మి కు వివాహ సమయంలో దాదాపు కోటి 50 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వివాహ సమయంలో మహాలక్ష్మి ధరించిన బంగారు అంతా రవీందర్ పెట్టినదే అంటూ వార్తలు కూడా వినిపించాయి.

ఇంకొందరైతే మహాలక్ష్మి కోసం ఏకంగా బంగారు పూత పూయించిన మంచాన్ని తయారు చేయించాడు అనే వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఈమధ్య ఈ జంట హనీమూన్ వెళ్లి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక వీరిపై వచ్చిన ఏ కామెంట్ ను ఇంతవరకు స్పందించకుండా ఈ జంట ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

కొందరైతే ఏకంగా డబ్బు కోసమే నిర్మాతను పెళ్లి చేసుకుందని ఆమె పై నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు రవీందర్ ను చూసి కాదు ఆయన మనసు చూసి దగ్గర అయిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విశేషం ఏమిటంటే వీరిద్దరికీ ఇది రెండవ పెళ్లి. ఇంతకుముందే వివాహం జరిగి కొన్ని కారణాల విడిపోవడం ద్వారా రెండవ వివాహం చేసుకొని ఒంటరి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -