Skanda: స్కంద సినిమాలో రామ్ చెల్లెలుగా నటించిన ఈ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Skanda: టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి బోయపాటి శ్రీను(Boyapati Sreenu) సినిమా వస్తుంది అంటే ఆ సినిమా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా బోయపాటి శ్రీను రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం స్కంద(Skanda) . ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా శ్రీ లీల(Sreeleel ).నటించారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో రామ్ పోతినేని చెల్లెలుగా నటించిన అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో రామ్ చెల్లెలుగా నటించిన ఈ నటి ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్న విషయాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. స్కంద సినిమాలో రామ్ కి చెల్లెలుగా నటించిన అమ్మాయి పేరు అమృత చౌదరి(Amrutha Chowdary) ఈమె పక్క మన తెలుగు అమ్మాయి. భీమవరానికి చెందినటువంటి అమృత చౌదరి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అయితే ఈమె ఇంజనీరింగ్ చేసే సమయంలోనే తనలో ఉన్నటువంటి నటన నైపుణ్యాన్ని బయటపెట్టింది. కాలేజీ రోజుల్లోనే ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేయడమే కాకుండా ఎన్నో కవర్ సాంగ్స్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇలా హీరోయిన్ కు ఏమాత్రం తీసుపోని క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి అమృత చౌదరి ఏకంగా సినిమాలో కూడా అవకాశం అందుకున్నారు. ఇక ఈ సినిమాలో ఈమె నటన కూడా ఎంతో అద్భుతం అని చెప్పాలి.

ఇలా మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన అమృత చౌదరికి భవిష్యత్తులో మరికొన్ని సినిమా అవకాశాలు కూడా వస్తాయని హీరోయిన్గా అవకాశాలు వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -