Skanda: ఓటీటీ లో స్కంద రిలీజ్.. ఫిక్సయిన స్ట్రీమింగ్ డేట్!

Skanda:  సెప్టెంబర్ 28న థియేటర్లలో భారీ అంచనాలతో రిలీజ్ అయిన స్కంద మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించడం, రామ్ పోతినేని ఎనర్జిటిక్ యాక్టింగ్, శ్రీ లీల అందాలు కలబోత వలన ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే మిక్స్డ్ టాక్ రావటంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. అయితే ఈ సినిమాని ఓటీటీ లో రిలీజ్ చేయటానికి నిర్ణయించుకున్నారు మేకర్స్.

స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారు అయినట్లు సమాచారం. స్కంద సినిమాను తన స్టైల్ లో తెరకెక్కించారు బోయపాటి. ఇమేజినేషన్ కి తగ్గట్టుగా రామ్ కూడా ఎనర్జిటిక్ గా యాక్షన్ సీక్వెన్స్ లు చేశాడు. నిజానికి ఈ సినిమాలో రామ్ యాక్షన్ గాని ఫైట్లు గాని ఇరగదీసాడని చెప్పవచ్చు. శ్రీ లీల విషయం ఇక చెప్పనే అవసరం లేదు. ఆమె అందంలోనూ, నటనలోనూ ఇప్పటికే ఓ రేంజ్ లో స్టార్ డం దక్కించుకుంది.

అయినప్పటికీ సినిమా ప్లాప్ అవటానికి కారణాలు..కథ, కథనం పరంగా లోటు జరిగిందని, ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని రివ్యూలు చెప్తున్నాయి. స్కంద సినిమాలో రామ్ పోతినేని, శ్రీనీలతో పాటు సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ, ప్రిన్స్ సిసెల్, అజయ్ పుర్కర్, దగ్గుపాటి రాజా, ప్రభాకర్, పృధ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఊర్వశి రౌతేలా కల్ట్ మామ అనే స్పెషల్ సాంగ్ తో ఉర్రూతలూగించింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీలో కూడా సెప్టెంబర్ 28న రిలీజ్ అయింది.

అయితే అన్ని భాషలలో కూడా అపజయాన్ని మూటగట్టుకుంది. స్కంద సినిమా ఓటీటీ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ దక్కించుకుంది. దీంతో అక్టోబర్ 27వ తేదీన స్కంద సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ రానందనే సమాచారం బయటకు వచ్చింది. తెలుగుతోపాటు హిందీ తమిళం, కన్నడం, మలయాళం లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది అని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -