Skanda: ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్ల ఖర్చు.. స్కంద మూవీని బోయపాటి ఈ రేంజ్ లో ముంచేశారా?

Skanda: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజస్టర్ గా నిలిచింది. ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే స్కంద సినిమాలో ఫస్ట్ ఫైట్ కి బోయపాటి ఏకంగా నాలుగున్నర కోట్లు ఖర్చు పెట్టారట.

ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమాలో రామ్ ఇంట్రోను హైదరాబాద్ పాత బస్తీలో జరిగే సదరు పండగ నేపథ్యంలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. సదరు పండుగలో దున్నపోతుల మధ్య పోటీ నిర్వహిస్తుండగా అక్కడికి ముఖ్యమంత్రి వస్తాడు. బర్రెలకు ఇంజక్షన్లు ఇచ్చి అవి అదుపు తప్పే గందరగోళంలో సీఎంను లేపేయాలని ప్రత్యర్థి వర్గం ప్లాన్ చేస్తే హీరో రంగంలోకి దిగి వాళ్లను అడ్డుకుంటాడు. ఈ నేపథ్యంలో బుల్ ఫైట్‌ను కొంచెం భారీగానే చిత్రీకరించాడు బోయపాటి. రెగ్యులర్ ఫైట్లతో పోలిస్తే ప్రేక్షకులకు ఇది భిన్నమైన అనుభూతినే ఇస్తుంది. కానీ ఇది మరీ ఔట్ స్టాండింగ్, వావ్ అనుకునే రేంజిలో అయితే ఏమీ లేదు.

ఈ యాక్షన్ సీక్వెన్సుకి ఏకంగా నాలుగున్నర కోట్లు పెట్టారంటే విడ్డూరంగానే అనిపిస్తుంది. రామ్ స్థాయి హీరో సినిమాలో ఇంత ఖర్చు టూ మచ్ అనే చెప్పాలి. ఈ సీక్వెన్స్ కోసం పెద్ద సంఖ్యలో బర్రెల్ని తెప్పించడంతో పాటు ఏకంగా 29 జనరేటర్లు వాడినట్లు బోయపాటి వెల్లడించాడు. అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా భారీగా ఖర్చయిందని కొన్ని రోజుల పాటు రిహార్సల్స్ చేసి ఈ సీక్వెన్స్ తీశామని అందువల్ల భారీగా ఖర్చు తప్పలేదని బోయపాటి తెలిపాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాలుగున్నర కోట్లు అంటే ఒక చిన్నపాటి సినిమాని తీయవచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -