బొగ్గు వ్యాపారానికి భారీ డిమాండ్.. కేజీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా పల్లెటూరు వాతావరణంలో ఉండే వారికి బొగ్గు ఎంతో విరివిగా లభిస్తుంది. పల్లెటూరులో ఉండేవారు నిత్యం కట్టెల పొయ్యి ఉపయోగించడం వల్ల వారికి బొగ్గుకి ఏమాత్రం కొదువ ఉండదు. కానీ పట్టణాలలో ఉండే వారికి బొగ్గు కావాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న రోజులలో ప్రతి ఒక్కటి మనం ఎంతో సులువుగా కొనుక్కోగలుగుతున్నాము. అయితే బొగ్గు కొనుగోలు చేయాలంటే ఒకప్పుడు ఎంతో కష్టపడాల్సి ఉండేది.

ఈ కామర్స్ వెబ్సైట్స్ అభివృద్ధి చెందిన తర్వాత ఇలాంటి వాటికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఎన్నో రకాల వస్తువులను మనకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి.మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చివరికి కట్టెల బొగ్గు కూడా మనకు అమెజాన్ లో లభించడం గమనార్హం. పట్టణాలలో నివసించే వారికి బొగ్గు కావాలంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. తద్వారా బొగ్గును కూడా అమెజాన్ వెబ్ సైట్ ద్వారా ఎంతో సులభంగా కొనుగోలు చేయవచ్చు.

ఈ క్రమంలోనే అమెజాన్ ప్రస్తుతం బొగ్గును అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే కిలో బొగ్గు ధర చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోవడం ఖాయం. అమెజాన్ ఈ కామర్స్ సంస్థలు కిలో బొగ్గు ఏకంగా 299 రూపాయలు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా బొగ్గు ధర భారీగా ఉండడంతో ఇది చూసిన కొందరు ఈ వ్యాపారం చేస్తే బాగా డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు.

ఒకప్పుడు పల్లెటూర్లో ఎంతో విరివిగా లభించే ఈ బొగ్గు ఇప్పుడు కిలో 300 పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుత కాలంలో బొగ్గు వినియోగం కూడా అధికంగా ఉండడంతో ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి.ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే తప్పనిసరిగా ధూపం వేయడానికి బొగ్గు అవసరమవుతుంది అలాగే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆహారంలో ఎన్నో మార్పులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే బాబిక్యూర్ స్టైల్లో ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవడం వల్ల బొగ్గుకు భారీగా డిమాండ్ పెరిగిందని చెప్పాలి. ఏది ఏమైనా కిలో బొగ్గు 299 అంటేనే బొగ్గుకు డిమాండ్ ఎంత ఉందో తెలిసిపోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -