Amazon Prime: మళ్లీ సబ్ స్క్రిప్షన్ ధర పెంచేసిన అమెజాన్.. ఏమైందంటే?

Amazon Prime: తాజాగా అమెజాన్ ప్రైమ్ సంస్థ ఒక ఊహించని షాక్ ను ఇచ్చింది. సబ్‌స్క్రిప్షన్‌ ధరను పెంచి ఒక్కసారిగా యూజర్స్ కి షాక్ ఇచ్చింది అమెజాన్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాను ఏకంగా 67శాతం పెంచింది. అంతేకాకుండా త్రైమాసిక ప్లాన్ ని కూడా పెంచింది. కానీ సంవత్సరం ప్లాన్ లో మాత్రమే ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే తాజాగా పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చేసాయి.


అయితే ఇప్పటికే సబ్‌స్క్రైబ్‌ అయిన వారికి 2024 జనవరి 15 వరకు పాత రేట్లే వర్తిస్తాయి. కానీ ఏదైనా కారణంతో రెన్యువల్‌ ఫెయిల్‌ అయితే కొత్త ధరకు ప్లాన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని అమెజాన్ సంస్థ వెల్లడించింది.

 

దాంతో అమెజాన్ ప్రైమ్ యూజర్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ నెలవారీ చందా ఇప్పటివరకు రూ.179గా ఉండేది. దానిని తాజాగా రూ.299కు పెంచుతున్నట్లు అమెజాన్‌ పేర్కొంది. ఈ నెల వారి ప్లాన్ మీద ఒకేసారి రూ.129 రూపాయలను పెంచింది. అదేవిధంగా మూడు నెలల చందా రూ.459 నుంచి రూ.599కు పెంచింది. అంటే ఏకంగా రూ.149 పెంచింది. ఇకపోతే ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ రూ.1499 ఉండగా అందులో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. మరోవైపు అమెజాన్‌ లైట్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను రూ.999కు లభిస్తోంది.

ఇందులో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌లో ఉండే అన్ని సదుపాయాలు ఉంటాయి. కానీ ప్రైమ్‌ వీడియో కంటెంట్‌ను SD క్వాలిటీలో చూడ్డానికి మాత్రమే వీలు ఉంటుంది. అందులో ప్రకటనలు కూడా ఉంటాయి. అమెజన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ఆర్డర్‌ వాల్యూతో సంబంధం లేకుండా ఫ్రీ డెలివరీ సదుపాయం, ప్రైమ్‌ వీడియో, ప్రైమ్‌ మ్యూజిక్‌, ప్రైమ్‌ రీడింగ్‌ వంటి సదుపాయాలను అమెజాన్‌ సంస్థ అందిస్తోంది. ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్ల కోసం ప్రత్యేక సేల్స్‌ నిర్వహించంతో పాటు లైటనింగ్‌ డీల్స్‌ వంటి సదుపాయాలను కూడా కల్పిస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -