Prabhas Krishnamraju: ప్రభాస్ కృష్ణంరాజు గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

Prabhas Krishnamraju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దివంగత నటుడు కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కృష్ణంరాజు హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి చివరి క్షణాల వరకు కళామతల్లికి సేవలు అందించారు. ఇక ఈయన వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ప్రభాస్ సైతం వరుస సినిమాలలో నటిస్తూ ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఐదారు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

కృష్ణంరాజు ప్రభాస్ ఇద్దరు కూడా సినిమాలపరంగా అద్భుతమైన నటులు అనిపించుకున్నారు. అయితే వీరు సినిమాలలో మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా ఎంతో మంచి మనసున్న హీరోలని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు.ఇక ప్రభాస్ కృష్ణంరాజు తోటి నటినటులకు ఇచ్చే ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన శత్రువు అయిన ఇంటి గడప తొక్కుకొని వస్తే వారికి అతిథి మర్యాదలు చేయాలనే నైజం కృష్ణంరాజు గారిది.ఆ అలవాట్లు ప్రభాస్ కి కూడా వచ్చాయని చెప్పాలి.

 

ఇక ప్రభాస్ సినిమా షూటింగ్లో ఉన్నారు అంటే తప్పనిసరిగా ఇంటి నుంచి భోజనం అందరికీ వెళ్లాల్సిందే అయితే ఈయన ఆతిథ్యం ఇచ్చినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి సోషల్ మీడియా వేదికగా ఎంతో గొప్పగా తెలియజేశారు. అయితే ప్రభాస్ కేవలం సెలబ్రిటీలకు మాత్రమే ఆతిథ్యం ఇవ్వరని లైట్ బాయ్ నుంచి మొదలుకొని స్టార్ సెలబ్రిటీల వరకు అందరి పట్ల ఒకే విధమైన ప్రేమను చూపిస్తారని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి వెల్లడించారు.

 

ఇతరుల పట్ల వీరు చూపించే ప్రేమలో కృష్ణంరాజు గారికి ప్రభాస్ ఏ మాత్రం తీసుపోరని తెలియజేశారు. ఇక ఇంట్లో ఎన్ని రకాల భోజనాలు చేస్తే అన్ని రకాల భోజనాలు ప్రతి ఒక్కరూ తినాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని,ప్రభాస్ కృష్ణంరాజు ఇద్దరు కూడా ఇతరుల పట్ల చాలా ప్రేమను చూపిస్తారని కృష్ణంరాజు గారి వద్ద నుంచి ప్రభాస్ కూడా ఈ విషయాలను తెలుసుకున్నారని శ్యామలాదేవి ఈ సందర్భంగా తన భర్త, కొడుకు గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pensioners Party Chief Subbarayan: ఒక్కో విశ్రాంత ఉద్యోగికి జగన్ 2.5 లక్షలు ఇవ్వాలట.. పాలనలో ఇంత అన్యాయమా?

Pensioners Party Chief Subbarayan: గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఓటు వేయడానికి ముందు చంద్రబాబు నాయుడు హయామంలో జరిగిన అభివృద్ధి జగన్...
- Advertisement -
- Advertisement -