Sai Pallavi: సాయిపల్లవి రిజెక్ట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?

Sai Pallavi: ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి సాయి పల్లవి. సహజ నటనతో ఏ విధమైనటువంటి మేకప్ లేకుండా ఎంతో కథా ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ఈమె ఇటీవల వరుస సినిమాలతో బిజీ అయ్యారు. గత కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సాయి పల్లవి ఇక సినిమాలకు దూరమవుతారని ఈమె వైద్య వృత్తిలో స్థిరపడతారు అంటూ పలువురు కామెంట్లు చేశారు.

 

ఇక సాయి పల్లవి మాత్రం కొంత విరామం తీసుకున్నప్పటికీ ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. సాయి పల్లవి ఏదైనా ఒక సినిమాకు కమిట్ అయ్యారు అంటే ఆ సినిమాలో ఏ విధమైనటువంటి రొమాంటిక్ సన్నివేశాలు లేకుండా ఉండటం అలాగే కథకు చాలా ప్రాధాన్యత ఉంటేనే ఆమె సినిమాలకు కమిట్ అవుతారు అనే విషయం మనకు తెలిసిందే.

కథ ప్రాధాన్యత లేకపోయినా ఎలాంటి స్టార్ హీరో సినిమా అయినా కూడా నిర్మొహమాటంగా తాను చేయనని చెప్పేస్తుంటారు. అయితే సాయి పల్లవి ఈ కారణాలతో రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. మరి ఈమె రిజెక్ట్ ఆ సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే…మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ పాత్రలో ముందుగా ఈమెకి అవకాశం వచ్చింది కానీ ఆ పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో సాయి పల్లవి రిజెక్ట్ చేశారు.

 

ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా చంద్రముఖి 2 లో కూడా కంగనా పాత్రలో సాయి పల్లవి ఎంపికయ్యారు కానీ ఈ సినిమాలో కూడా ఈమె నటించలేదు విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ సినిమాలో ముందుగా అవకాశం సాయి పల్లవికి వచ్చింది. ఇందులో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. రష్మిక ఈ సినిమాలో భాగమయ్యారు. వీటితోపాటు హీరో విజయ్ లియో అలాగే అజిత్ సరసన వలిమై సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి కానీ ఈమెకు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు ఇక ఈ సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -