Nani: ఆ హీరోలకు భిన్నంగా నాని స్టైల్.. భారీ బ్లాక్ బస్టర్లు ఖాయమా?

Nani: నేను కన్ఫ్యూజన్ మొదలు పెడితే నాకంటే ఎవడు అందరిని కన్ఫ్యూజ్ చేయలేడు అనే కన్ఫ్యూజన్లోనే నాచురల్ స్టార్ నాని ఉన్నారు. అసలు నాని ఈ కన్ఫ్యూజన్లో ఉండడమేంటి ఈ కన్ఫ్యూజన్ ప్రేక్షకులకు ఏంటి అనే విషయాన్ని వస్తే.. ఏడాదికి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న నాని సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత ప్రస్తుతం శనివారం షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఇప్పటికే ఈ సినిమా రెండు మేజర్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయింది.

ఇక ఈ సినిమా మరో రెండు నెలల్లో గట్టిగా షూటింగ్ చేస్తే పూర్తి అవుతుంది. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది నాని కన్ఫ్యూజన్. నాని కళ్ళముందు ఎన్నో అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్లో నాని ఉన్నారు. నానికి సరిపోదా శనివారం సినిమా తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయి ఒకటి త్రివిక్రమ్ పేరు వినిపించింది అయితే త్రివిక్రమ్ తో సినిమా అంటే ఇప్పట్లో అయ్యే పని కాదు ఇక తనకు దసరా వంటి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

 

ఇక తమిళ డైరెక్టర్ శిబి చక్రవర్తితో అనుకున్నటువంటి సినిమా కొన్ని కారణాలవల్ల ఆగిపోయింది అలాగే మరో డైరెక్టర్ వేణు కూడా నాని కోసం ఒక కథ సిద్ధం చేసి పెట్టుకున్నారు. బలగం సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు నాని కోసం ఓ కథ సిద్ధం చేశారని తెలుస్తుంది. మరి ఈయన ఏ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారని తెలుస్తోంది .అయితే ఎక్కువ శాతం నాని తన తదుపరి సినిమా బలగం డైరెక్టర్ వేణు తోనే చేయబోతున్నారని తెలుస్తోంది. మరి బలగం వంటి సక్సెస్ ఇచ్చినటువంటి వేణు నానికి ఎలాంటి సక్సెస్ అందిస్తారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -