GV Prakash: అలాంటి రోల్స్ కు దూరమని చెప్పిన జీవీ ప్రకాష్.. ఏమైందంటే?

GV Prakash: ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న తర్వాత వారందరూ కూడా పెద్ద ఎత్తున బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో చిన్న సెలెబ్రెటీల నుంచి పెద్దవారి వరకు డైరెక్టర్లు సింగర్లు మ్యూజిక్ డైరెక్టర్లు అయినా కూడా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తూ ఉంటారు.

 

ఈ క్రమంలోనే ఒక గాయకుడు మాత్రం తాను కోట్లు ఇస్తానన్న ఇలాంటి వాటిలో నటించను అంటూ ఇటీవల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో నటుడిగా గాయకుడిగా సింగర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో జీవి ప్రకాష్ కుమార్ ఒకరు.

ఇక సినీ రంగంలో ప్రతి ఒక్కరీ ప్రతిభను ప్రోత్సహించే విధంగా నరేష్ బృందం స్టార్డా అనే సరికొత్త ఫ్లాట్ ఫామ్ ప్రారంభించారు. అయితే ఎంతోమందిలో ఎన్నో రకాల ప్రతిభలు ఉంటాయి కానీ వాటిని నిరూపించుకోవడానికి సరైన ప్లాట్ ఫామ్ దొరకడం లేదని అలాంటి వారి కోసమే ఈ స్టార్డా ప్రారంభించినట్లు తెలిపారు. ఇక స్టార్డా బ్రాండ్ అంబాసిడర్ గా జీవి ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు.

 

ఈ క్రమంలోనే గురువారం చెన్నైలో ఓ హోటల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే జీ వీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. తాను మ్యూజిక్ డైరెక్టర్ గా పలు సినిమాలు చేశాను అదేవిధంగా హీరోగా 23 సినిమాలు చేశానని ఈయన తెలిపారు. ఇక నేను జూదం ఆడటం చల్లని పానీయాలు వంటి వాటికి ప్రచారకర్తగా ఉండనని కొన్ని కోట్ల రూపాయలు ఇస్తామన్న వీటిని ప్రమోట్ చేయను అంటూ ఈ సందర్భంగా జీవి ప్రవీణ్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ మేనిఫెస్టో మోసాలు.. శవాల మీద పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేశారా?

CM Jagan:  జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తనకు బైబిల్ ఖురాన్ భగవద్గీత లాంటిది అని చెబుతూ ఉంటారు అయితే ఎన్నికలలో భాగంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నో పథకాలను అమలు పరచలేదు అయితే ఇలాంటి...
- Advertisement -
- Advertisement -