Harish Shankar: వెంట్రుక కూడా పీకలేరు అంటూ హరీష్ శంకర్ వార్నింగ్.. ఏమైందంటే?

Harish Shankar: ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒకరు. ఈయన దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చేశారు. అయితే ఇటీవల కాలంలో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. అయితే తాజాగా ఈయన రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నటించిన సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా ల గురించి రాసే నెగిటివ్ రివ్యూల పై స్పందించారు.

 

మాకు పొలిటికల్ గా ఎలాంటి అజెండాలు లేవు. మేము చేసే సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలని అన్ని వర్గాల వారు సినిమా థియేటర్లకు రావాలని మా సినిమాలకు హౌస్ ఫుల్ కావాలని కోరుకుంటాము కానీ చాలామంది మాపట్ల ఎన్నో రకాల విమర్శలు చేయడం ఎగతాళి చేయడం వంటివి చేస్తుంటారు.

ఇక ఇటీవల కాలంలో తన గురించి ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. నాలుగేళ్లుగా ఎలాంటి సినిమా లేదని నిర్మాత ఇంట్లో కూర్చొని ఫుల్లుగా పెగ్గులేస్తూ ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ తీశారంటూ పరోక్షంగా షాడో ఇమేజ్ పెట్టి నా గురించి వార్తలు రాస్తున్నాయి. మీకు నిజంగానే అంత దమ్ము ధైర్యం ఉంటే నా ఫోటో పెట్టి నా పేరు రాసి ఆర్టికల్ ఇవ్వండి అంటూ మీడియా పై ఫైర్ అయ్యారు.

 

హరీష్ శంకర్ తెల్లవార్లు తాగాడు అని రాయి నీకు నేను కౌంటర్ ఇస్తాను. నేను తెల్లవార్లు తాగితే నువ్వు నాకు ఐస్ వేసావా ?పెగ్ తీసురారా అంటే తీసుకువచ్చావా? ఏంట్రా నీ సోర్స్? పోనీ ఫొటో వేసి ధైర్యంగా రాస్తాడా? అంటే లేదు. ఎంతకాలం ఇలా? రేపు మళ్లీ నా సినిమా గురించి రాస్తాడు. గత నాలుగు ఏళ్లుగా గ్యాప్ వచ్చింది అంటున్నారు ప్రస్తుతం నేను నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాను అంటూ హరీష్ శంకర్ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -