SSC Topper: పదిలో స్టేట్ టాపర్ ఎవరో తెలుసా.. ఎన్ని మార్కులు వచ్చాయంటే?

SSC Topper: ఏపీలో పదవ తరగతి విద్యార్థుల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈసారి ఏపీలో విద్యార్థులు రాష్ట్రస్థాయిలో కూడా ప్రభంజనాన్ని సృష్టించారు. ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే కాకుండా గవర్నమెంట్ విద్యాసంస్థలు చదివిన విద్యార్థులు కూడా ప్రతిభను కనబరిచారు. అత్యధిక మార్కులతో స్కూల్స్ ఫస్ట్ రావడంతో పాటు మండలం జిల్లాలో కూడా ఫస్ట్ వచ్చారు. ఇప్పటికే ఆయా విద్యాసంస్థల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. కాగా 10లో ప్రపంచం సృష్టించిన ఒక్కొక్క విద్యార్థి గురించి ఆలస్యంగా విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఏపీలో ఒక విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబరిచింది. ఒక ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుతున్న ఒక విద్యార్థిని పదవ తరగతి ఫలితాల్లో ఏకంగా ఏపీలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆ విద్యార్థి ఎవరు? ఆమె ఎక్కడ చదువుకుంది ఏంటి అన్న వివరాల విషయానికి వస్తే.. తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాలలో మండపేట విద్యార్థి రాష్ట్రస్థాయిలో సత్తాను చాటింది. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న శ్రావణి 600 మార్కుల గాను 597 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకును సాధించింది. దాంతో శ్రావణి రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించింది అని ఆమె చదువుకున్న స్కూల్ అధ్యాపకులు వెల్లడించారు.

 

రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరిచిన శ్రావణికి అధ్యాపకులు, తోటి విద్యార్థులు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. శ్రావణి తో పాటు ఏపీలో గవర్నమెంట్ విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు కూడా శ్రావణి కి దగ్గరగా మార్కులు తెచ్చుకుని ప్రతిభను కనబరిచారు.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -