Eluru: ఈ కూలీ కూతురు నిజంగా గ్రేట్ కదా.. ఏకంగా 590 మార్కులు సాధించి?

Eluru: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయిన విషయం మనకు తెలిసింది. ఈ పరీక్ష ఫలితా లలో 72.26 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో పాసయ్యారు. ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. బాలురు 69.27 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 75.38 శాతం పాసయ్యారు. జిల్లాల వారీగా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో ఉంది.

ఏలూరు జిల్లా పెదపాడు మండలం పేరు బాగా వినిపిస్తోంది. ఎందుకంటే వట్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివిన పసుపులేటి గాయత్రికి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యదిక మార్కులు సాధించి వార్తల్లో నిలిచింది. ఈమె పదో తరగతిలో ఏకంగా 590 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది.గాయత్రికి ఇన్ని మార్కులు రావడంతో తన తండ్రి రమేష్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా రమేష్ కూతురు ఇలా పదోతరగతి మంచి మార్కులు సాధించడంతో టీచర్లు కూడా విద్యార్థికి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. ఇలా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతూ ఇన్ని మార్కులు సాధించడంతో ప్రతి ఒక్కరూ విద్యార్థి గాయత్రికి అభినందనలు తెలియ చేస్తున్నారు. జూన్ 2 నుంచి 10 వరకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -