Avinash Reddy: అవినాష్ రెడ్డికి భయం అవసరమా.. తప్పు చేయకపోతే టెన్షన్ ఎందుకు!

Avinash Reddy: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డి ఏ క్షణమైన అరెస్టు కావచ్చు అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ అవినాష్ రెడ్డి మాత్రం జైలుకు వెళ్లడానికి చాలా భయపడుతున్నారని తెలుస్తుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు.

ఇలా అధికారులు తనని విచారణకు రావాలని కోరుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి మాత్రం ఏవో కుంటి సాకులు చెబుతూ తాను విచారణకు రాలేను అంటూ సిబిఐ సహనాన్ని పరీక్షిస్తున్నారు.ఇలా విచారణకు హాజరు కాకుండా వాయిదా వేస్తూ ఉండటం వల్ల సిబిఐ అధికారులకు మరింత అవకాశం ఇచ్చినట్లేనని పలువురు ఈ విషయంపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.అవినాష్ రెడ్డి తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి అని మరికొందరు కూడా సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

 

ఏ తప్పు చేయనప్పుడు సిబిఐ ఎదుట అవినాష్ రెడ్డి హాజరు కాకుండా విచారణకు హాజరు కాలేనని తనకు కొద్ది రోజులు గడువు కావాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక సిబిఐ విచారణ తర్వాత ఇలా చేస్తున్నారా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అరెస్టు చేసిన జైలుకు వెళ్లడానికి ఎందుకు అంత ఇబ్బంది వైయస్ ఫ్యామిలీకి జైలుకు విడదీయరా అని అనుబంధం ఉంది కదా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

 

ఎవరి దాకో ఎందుకో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం అవినీతి ఆరోపణల కేసులో భాగంగా 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించిన విషయం మనకు తెలిసిందే. ఇలా జైలుకు వెళ్లిన జగన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు మరి అవినాష్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారంటూ పలువురు ఈ విషయంపై సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు అవినాష్ రెడ్డికి సంబంధం ఉందా అందుకే ఈయన ఇంతలా భయపడుతున్నారా అని అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -