Nakshatra: ఈ నక్షత్రంకు అంత శక్తి ఉందా.. అన్నీ అనుకూలంగా జరుగుతాయా?

Nakshatra: మామూలుగా జన్మ నక్షత్ర ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి లాగా ఉంటుంది. నక్షత్రాలను బట్టి ఎవరి స్వభావం ఎలాంటిది అని చెప్పవచ్చు. మరి నక్షత్రాలను బట్టి భవిష్యత్తులో ఎవరికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అశ్విని నక్షత్రం దేవగణ నక్షత్రం. నీతిమంతులు, ప్రియమైన భాష కలిగిన వారు. అలాగే చక్కని రూపం కలిగి ఉంటారు. కానీ ఈ నక్షత్రానికి చెందినవారు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు. సమాజంలో గౌరవం పొందాలని చూస్తారు. భరణి నక్షత్రం మానవ గణ నక్షత్రం. వీళ్ళు ఆరోగ్యవంతులు, సుఖవంతులు కూడా. అదేవిధంగా కృతిక నక్షత్రం రాక్షస గణముల కలవారు. వీరు పేరు, ప్రత్యేకతల్ని పొందుతారు.

 

రోహిణి నక్షత్రం మానవ గణముల కలవారు సత్యవంతులు. శుభ్రత ఎక్కువ. మృగశిర నక్షత్రం దేవగణ నక్షత్రం. వీళ్ళెప్పుడు ఉత్సాహంగా ఉంటారు. స్నేహితుల్ని బాగా ఆదరిస్తూ ఉంటారు. ఆరుద్ర నక్షత్రం కలవారు సొంత వారిపై ఎప్పుడూ ప్రేమని కురిపిస్తారు. జ్ఞాపకశక్తి వీళ్ళకి ఎక్కువ. పునర్వసు నక్షత్రం వాళ్లు మంచి స్వభావులు. అల్ప సంతోషులు. పుష్యమి నక్షత్రం వాళ్లు శాంత స్వభావం కలవారు. బాల్యం నుండి యవ్వనం వరకు ఎంతగానో కష్టపడి మంచి స్థాయికి వస్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సున్నిత మనస్కులు. రాక్షస గానము కనుక ఎక్కువ పట్టుదల, పగతో వీళ్ళు ఉంటారు. మఖ నక్షత్రం వాళ్లు పితృభక్తులు. ధనవంతులు. రాక్షస గణము కనుక పట్టుదల, ప్రతీకారం ఎక్కువ. పుబ్బ నక్షత్రం వారు సౌమ్యులు. దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఉత్తర నక్షత్రం వాళ్లకి వారి తండ్రి వలన ప్రయోజనం ఎక్కువ కలుగుతుంది.

అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్లు ఉత్సాహవంతులు. ఈ నక్షత్ర జాతకులు ఆకర్షణ కలిగి ఉంటారు. ప్రేమ వివాహాలు వీరి జీవితంలో ప్రధాన ప్రస్తావనవుతాయి. అలాగే చిత్త నక్షత్రం వారు రాక్షస గణానికి చెందినవారు. వీళ్లు జీవితంలో అనుభవించిన కష్టాలు ఎవరు అనుభవించకూడదని చూస్తారు. స్వాతి నక్షత్రం వారు మేధావులుగా, అధికారులుగా రాణిస్తారు. ధార్మికత, సాత్విక గుణం ఎక్కువ ఉంటుంది. విశాఖ నక్షత్రం వారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా పెరుగుతారు. వైద్య, వ్యాపార సాంకేతిక రంగాల్లో రాణిస్తారు. అనురాధ నక్షత్రం వారు వృద్ధులు, పెద్దల పట్ల గౌరవం కలిగి ఉంటారు. విద్యలో కూడా రాణిస్తారు. జేష్ట నక్షత్రం వారికి కోపం ఎక్కువ ఉంటుంది. శక్తి లేకపోయినా అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

 

మూల నక్షత్రం వారు లక్ష్మీ పుత్రులు. కుటుంబం కొరకు తల్లిదండ్రుల కొరకు కొంత దాకా త్యాగం చేస్తారు. పూర్వాషాడ నక్షత్రం వాళ్ళు కళల పై ఆసక్తి చూపిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. ఉత్తరాషాడ నక్షత్రం వారు కృతజ్ఞతతో ఉంటారు. వీళ్ళది మనుష్య గుణం. ప్రారంభంలో కష్టాలను ఎదుర్కొన్నా మంచి స్థాయికి చేరుకుంటారు. శ్రావణ నక్షత్రం కలవారు అంతర్గత ఆలోచన, మేదస్సు తో ఉంటారు. ఎవరికి అర్థం కారు. మనోధర్యంతో నిర్ణయాలని తీసుకుంటారు. ధనిష్ట నక్షత్రం వారు మంచి బుద్ధిని కలిగి ఉంటారు. వ్యాపారవేత్తలుగా రాణిస్తారు.

 

శతభిష నక్షత్రం వారు ఎగుమతి వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది. అన్ని మార్గాల్లోని స్నేహితులు వీళ్ళకి ఉంటారు. పూర్వభద్ర నక్షత్రం కలవారు ధనవంతులు.ఈ నక్షత్రం వారు అనేక రంగాల పై అవగాహన కలిగి ఉంటారు. పెద్దలపై గౌరవం, భయం ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు గొప్పలు చెప్పుకోరు. ఇతరులని కించపరచురు. చదువు మీద మంచి పట్టు ఉంటుంది. రేవతి నక్షత్రం వారు ప్రశాంతంగా, నిదానంగా సమాధానాలు చెప్తారు. దూర ప్రాంతాల్లో చదువుకుని స్థిరపడడానికి బంధువుల సహకారం అందుతుంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -