Negative Energy: ఇంట్లో ప్రతికూల శక్తులు దూరం కావాలంటే అలా చేయాలా.. ఏం జరిగిందంటే?

Negative Energy: సాధారణంగా మన కుటుంబంలో ఏ విధమైనటువంటి కలహాలు,మనస్పర్ధలు కోపతాపాలు లేకుండా సంతోషంగా ఉండాలి అంటే మన ఇంట్లోని వాతావరణం ప్రశాంతంగా ఉండాలి ఇలా ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడే ఏ విధమైనటువంటి కష్టాలు ఇబ్బందులు మనస్పర్ధలు ఉండవు. అయితే ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఇంట్లో ఏర్పడుతున్నాయి అంటే కచ్చితంగా మన ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నట్టేనని అర్థం. ఇలా ప్రతికూల శక్తి ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు జరగకపోవడం వంటివి ఏర్పడుతూ ఉంటాయి.

ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడాలి అంటే ఇంట్లో ఈ నియమాలను తప్పకుండా పాటించాలి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.మన ఇంట్లో ప్రతికూల పరిస్థితులు తొలగిపోవాలి అంటే ముందుగా మనం మన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న గోడ గడియారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

 

ఇంట్లో ఆగిపోయిన చెడిపోయిన గోడ గడియారం కనుక ఉంటే వెంటనే రిపేర్ చేయించాలి లేదా అలాంటి వాటిని తీసేయాలి. చెడిపోయిన గడియారం ఉంటే ఆ ఇంట్లో ఎక్కువగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా గడియారం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఇంట్లో ఎట్టి పరిస్థితులలోను మెటల్ ప్లాస్టిక్ ఫర్నిచర్ లేకుండా చూసుకోవాలి. ఇలాంటి ఫర్నిచర్ కనుక ఉంటే ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.

 

అదేవిధంగా ఇంటి గుమ్మానికి ఎదురుగా తులసి మొక్కను నాటడం వల్ల మన ఇంట్లో ఉన్న ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.ఇలా ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా తులసి మొక్కను నాటడమే కాకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసి తులసిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

 

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -