Akukura: ఈ ఆకుకూర ఎముకలను ఉక్కులా మారుస్తుందా.. ఏమైందంటే?

Akukura: సాధారణంగా చాలా మంది ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ఇష్టపడరు. చాలామంది ఇలా ఆకుకూరలను దూరం పెడుతూ ఉంటారు. అయితే ఆకుకూరలను దూరం పెట్టడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతామనే విషయం తెలిసినా కూడా వాటిని తినడానికి ఇష్టపడరు. ఆకుకూరలలో రారాజు అయినటువంటి తోటకూరను చాలామంది దూరం పెడతారు.

ఈ తోటకూరలు కాస్త పసరు ఉండటం వల్ల తినడానికి చాలామంది ఇష్టపడరు. అయితే ఇందులోని పోషక విలువలు వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా ఎవరూ ఉండలేరు. ఇందులో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయనే విషయానికి వస్తే…విటమిన్ ఎ తో పాటు విటమిన్ కె, సి, బి6, ఫోలేట్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, రైబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. తోటకూర ఆకుల్లో మాంగనీస్, ఐరన్, కాపర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని సంపూర్ణ పోషకాహారంగా చెప్పవచ్చు.

 

ఇందులో విటమిన్ ఏ సి ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదం చేస్తుంది. అలాగే ఐరన్ పుష్కలంగా ఉండడంతో రక్తహీనతతో బాధపడే వారికి ఇది మంచి ఔషధం అని చెప్పవచ్చు ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఎంతో ప్రయోజనకరమని చెప్పాలి.

 

ఇక కాల్షియం కూడా ఇందులో పుష్కలంగా ఉండటంతో ఎముకలను దృఢంగా మారుస్తుంది. కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలలో పట్టుత్వాన్ని కలిగించి ఎముకలను చాలా దృఢంగా మారుస్తుంది. ఇక ఎవరైనా విరిగిన ఎముకల సమస్యతో బాధపడే వారు కూడా ఈ ఆకకూరను ప్రతిరోజు తీసుకోవడం వల్ల విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవడానికి దోహదం చేస్తుంది. ఇలా తోటకూరను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: తొలి విడత డబ్బు పంపిణీ దిశగా వైసీపీ అడుగులు.. కోట్లు చేతులు మారుతున్నాయా?

YSRCP: సాధారణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రచార కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలకు మందు, భోజనంతో పాటు రోజువారీ కూలీ కూడా డబ్బులను కూడా అందజేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే కూటమి చేతిలో...
- Advertisement -
- Advertisement -