Good Fat Foods: ఎలాంటి ఆహార పదార్థాలు తింటే మంచి కొవ్వు వస్తుందో తెలుసా?

Good Fat Foods: శరీరంలో కొవ్వు పెరిగిందంటే సాధారణంగా అందరూ భయపడతారు. శరీరంలో కొవ్వు చేరిందనగానే లావైపోతామో.. వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మందిలో అపోఆ ఉంటుంది. ఆహారంలో ఉండే ప్రతి కొవ్వు పదార్థంతో ప్రమాదం ఉంటుందన్న ఆలోచన సరికాదని వైద్య, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొవ్వులలో శాచురేటెడ్‌ (సంతృప్తి్త), అన్‌ శాచురేటెడ్‌ (అసంతృప్తి్త) అని రెండు రకాలు ఉంటాయి. వీటిలో అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్‌ శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుందని స్పష్టం చేస్తున్నారు. పలురకాల జీవ క్రియలకు అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్‌ ఎంతో తోడ్పడుతుందని అదే సమయంలో శరీరానికి మంచి శక్తిని కూడా అందిస్తుందని వివరిస్తున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాల్లో మంచి కొవ్వు ఉంటుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్యాట్‌ చేపలు: కొవ్వు, నూనెల శాతం ఎక్కువగా ఉండే ట్యూనా, సాల్మన్, ఇతర చేపలు అత్యంత ఆవశ్యకమైన ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లకు నిలయమని నిపుణులు చెబుతున్నారు. మన మెదడు, గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ చేపల్లో ప్రతి 100 గ్రాములకు 4.5 గ్రాముల మంచి ఫ్యాట్‌ లభిస్తుంది. ప్రొటీన్లు, విటమిన్లు, జింక్, అయోడిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి అత్యవసర ఖనిజాలు శరీరానికి అందుతాయి.

పెరుగు: శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోలయాటిక్‌ గా పెరుగుకు పేరుంది. అంతేకాకుండా పెరుగులో మంచి ఫ్యాట్‌ కూడా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల పెరుగులో 4.4 గ్రాముల మంచి ఫ్యాట్, 9 మిల్లీగ్రాముల ప్రోటీన్‌ లభిస్తాయయి. పెరుగులో డ్రై ఫ్రూట్స్, గింజలు, యాపిల్, అరటి, స్టాటెగ్రీల వంటివి చేర్చుకుని తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

గుడ్లు: దాదాపు అన్ని రకాల పోషకాలు లభించే గుడ్లలో కొవ్వు కూడా గణనీయంగానే ఉంటుంది. ఒక గుడ్డులో 5 గ్రాముల కొవ్వు పదార్థాలు ఉంటుండగా అందులో 1.6 గ్రాములు ఆధురేటెడ్, మిగతా 3.4 గ్రాములు అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్‌ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుడ్లలో ఆరు గ్రాముల ప్రోటీన్లు ఉంటాయని.. మన శరీరానికి అవసరమయ్యే తొమ్మిది రకాల అమైనో యాసిడ్లు ఉంటాయట.

గింజలు: వివిధ రకాల పండ్లు, కూరగాయల్లోని గింజలు కూడా మంచి కొవ్వులకు నిలయమని నిపుణులు చెబుతున్నారు. పొద్దు తిరుగుడు, స్టాక్స్‌ సీడ్స్, గుమ్మడి గింజలు, సజ్జ గింజలు వంటి గింజల్లో ప్రతి ఔన్స్‌ (28 గ్రాములు)కు 12 గ్రాముల మేర అన్‌ శాచురేటెడ్‌ ఫ్యాట్‌ ఉంటుందని శరీరానికి అత్యవసరమైన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్‌ సైతం లభిస్తోందట.

డార్క్‌ చాకోలేట్‌: తీపిగా ఉండి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాం అంటే డార్క్‌ చాకోలేటే. ప్రతి ఔన్స్‌ డార్క్‌ చాకోలెట్‌ లో 8.9 గ్రాముల ఆరోగ్యకర ప్యాట్‌ ఉంటుంది. 2 మిల్లీ గ్రాముల ఐరన్‌. 158 మిల్లీగ్రాముల పొటాషియం కూడా లభిస్తుందని మెర్సీపియం, ఐరన్, జింక్, కాపర్, ఫాస్పరస్‌ వంటి పోషక విలువలు ఉంటాయి.

డ్రైఫ్రూట్స్‌: శరీరానికి మంచి పోషకాలు అందించే ఆహారంలో డ్రైప్రూట్స్‌ ఎంతో కీలకమైనవి. ఒక ఔన్స్‌ (28 గ్రాములు) డ్రై ఫ్రూట్స్‌ లో 15 గ్రాముల కొవ్వు పదార్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటితో పాటు ఐరన్, విటమిన్‌–ఈ, కాపర్, మాంగనీస్, పాస్పరస్, ఫైబర్‌ వంటివి మంచి ఆరోగ్యానికి దోహదం చేస్తాయని వివరిస్తున్నారు. డ్రైఫ్రూట్స్‌ ను రోజు స్నాక్స్‌ లా తీసుకుంటే చాలా మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -