Custard Apple: సీతాఫలంతోనే కాదు ఆ చెట్టు ఆకులతోను బోలెడు ప్రయోజనాలు?

Custard Apple: సీతాఫలం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వర్షాకాలంలో వినాయక చవితి నుండి విరివిగా లభించే ఈ సీతాఫలం ఎన్నో రకాల పోషక విలువలను కలిగి ఉంటుంది. సీతాఫలంలో విటమిన్ ఏ,విటమిన్ సి, ఐరన్,పొటాషియం,మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి. ఈ సీతాఫలం నీ చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే లభించే ఈ పండ్ల కోసం చాలామంది సంవత్సరం కాలం పాటు ఎదురు చూస్తూ ఉంటారు. సీతాఫలం ఎంతో రుచిగా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది.
సీతాఫలం పండ్లు మాత్రమే కాకుండా సీతాఫలం ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి సీతాఫలం ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సీతాఫలం ఆకులు డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయడంలో బాగా పనిచేస్తాయి. ఆకులను నీటిలో మరిగించి వడపోసి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని తాగడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారికి సీతాఫలం ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. సీతాఫలం ఆకులు మరిగించిన నీటిని ప్రతి రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
దాని ద్వారా దగ్గు,జలుబు,జ్వరం వంటి సీజనల్ వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయి. అదేవిధంగా సీతాఫలం ఆకులలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఆకులు కాపాడతాయి. సీతాఫలం ఆకులలో కాపర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ క్రియ సమస్యలు మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అయితే సీతాఫలం ఆకులు, పండ్లు మాత్రమే కాకుండా బెరడు, గింజలను కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -