WhatsApp: వాట్సాప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా? మీ అకౌంట్ బ్లాక్ అవ్వడం పక్కా!!

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ యాప్ వాట్సాప్ వాడకం నానాటికీ పెరుగుతోంది. సులువుగా, తొందరగా మెసేజ్ పంపించడానికి వాట్సాప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. దీంతో ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగిస్తున్నారు. యాప్‌ను అధిక మంది వాడుతున్న నేపథ్యంలో.. వినియోగదారుల ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో యాజమాన్యం ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు యాప్ సెక్యూరిటీ చెకప్, యాప్‌ను దుర్వినియోగానికి ఉపయోగించే అకౌంట్లను బ్లాక్ చేస్తూ వస్తోంది. కేవలం ఆగస్టు నెలలో సంస్థ 2.3 మిలియన్ల ఖాతాలను బ్లాక్ చేసినట్లు అధికార సమాచారం తెలిపింది. అయితే ఇన్ని మిలియన్ల ఖాతాను బ్లాక్ చేయడానికి గల కారణాలను కూడా వెల్లడించింది. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

ఫార్వర్డ్ మెసేజ్‌లు..

చాలా మంది వాట్సాప్‌లో ఫార్వర్డ్ మెసేజ్‌లు షేర్ చేస్తుంటారు. దీంతో ఎక్కువ సంస్థలో వాటి స్టోరేజీ అధికమౌతోంది. దీంతో వాట్సాప్ ఈ ఫార్వర్డ్ మెసేజ్‌ల కోసం ఓ లేబుల్‌ను తయారు చేసింది. దీంతో ఆ ఫార్వర్డ్ మెసేజ్‌లకు ఆ లేబుల్ కనిపిస్తుంది. దీన్ని బట్టి ఆ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేయొద్దని అర్థం చేసుకోవాలి. ఒకవేళ కాదని మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ పోతే అకౌంట్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది.

అధిక మొత్తంలో మెసేజ్‌లు..

ఒకేసారి అధికమొత్తంలో మెసేజ్‌లు పంపించడం కూడా ప్రమాదమే. దీన్ని కూడా వాట్సాప్ తీవ్రంగా పరిగణిస్తోంది. మెషిన్, యూజర్ రిపోర్ట్ లెర్నింగ్ ద్వారా ఆటోమెటెడె సందేశాలను పంపేవారిని గుర్తించి వారి అకౌంట్‌ను వాట్సాప్ బ్లాక్ చేస్తోంది.

తెలియని నంబర్‌కు మెసేజ్ పంపడం..

గుర్తు తెలియని వ్యక్తి నంబర్‌కు మేసేజ్ పంపినా డేంజరే. ఏదైనా గ్రూపులో యాడ్ అవుతున్నప్పుడు తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి. వారి అనుమతి తీసుకోకుండానే చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ అవుతుంటారు. గుర్తు తెలియని వ్యక్తి నంబర్‌కు మెసేజ్ చేసినా.. వేధింపులకు పాల్పడినా వారి అకౌంట్ బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది.

నిబంధనలు అంగీకరించకపోతే..

వాట్సాప్ నిబంధనలు వినియోగదారులు తప్పనిసరిగా అంగీకరించాలి. ఒకవేళ షరతులు అంగీకరించకపోతే అకౌంట్ వెంటనే బ్లాక్ అవుతుంది. అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, వేధింపులు, అసభ్యకరమైన పదజాలాలు వాడినా.. ఆ సందేశాలను పంపినా అకౌంట్ బ్లాక్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -