Whats App: లింక్‌ ఓపెన్‌ చేయగానే లక్షలు పోయాయ్‌.. ఏం జరిగిందంటే?

Whats App: నేటి కాలంలో ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా సైబర్‌నేరాలు మాత్రం ఆగడం లేదు. రోజుకో చోటు ఎవరో ఒకరు సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి విలవిలలాడుతున్నారు. అమాయకులనే కాక విద్యావంతులు, మంది హోదాలో ఉన్న ఉద్యోగులు అత్యశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సైబర్‌ నేరాలపై పోలీసులు వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తున్నా సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. దొరికినంతా దండుకుంటున్నారు. ఇటీవల ఓ న్యాయవాది సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి లక్షలు పోగొట్టుకుని పోలీస్‌ స్టేషన్‌ ఆశ్రయిందంటే ఇట్టే అర్థమవుతోంది సైబర్‌ నేరగాళ్ల పనితీరు. తాజాగా ఓ ఉపాధ్యాయురాలు రూ.21 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అందుకు సంబం«ధించిన వివరాలు ఇలా..

అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని రెడ్డప్ప కాలనీలో నివాసముంటున్న విశ్రాంత ఉపాధ్యాయురాలు వరలక్ష్మి ఫోన్‌కు గుర్తు తెలియని ఫోన్‌ నంబర్‌ నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. వచ్చిన లింక్‌ ఏంటోనని ఓపెన్‌ చేయగానే ఆమె బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు డ్రా అవుతున్నట్లు మెసేజ్‌లు రావడం ప్రారంభం అయ్యాయి. పలు దఫాలుగా రూ. 20 వేలు, ఆ తర్వాత రూ.40 వేలు, మళ్లీ రూ.80 వేలు డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. ఇలా కట్‌ అవుతూ ఏకంగా రూ.21 లక్షలు ఆమె అకౌంట్‌ నుంచి దోచుకున్నారు. అప్రమత్తమైన వరలక్ష్మి పరుగు పరుగున బ్యాంక్‌కు పరగులు తీసింది.

పరిశీలించిన అధికారులు సైబర్‌ నేరగాళ్ల పనేనని నిర్ధారించారు. బ్యాంక్‌ అధికారుల సలహా మేరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింద. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఫోన్‌ నంబర్‌ ఆధారంగా నిందితులు పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అకౌంట్‌ నుంచి రూ.12 లక్షలు దోచుకున్న కొన్ని రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. గుర్తు తెలియని ఫోన్‌ నంబర్లు, మెసేజ్‌లు, లింక్‌లను ఓపెన్‌ చేయరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఎవరైన బాధితులు ఉంటే నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -