WhatsApp: సేవ్ చేయని నెంబర్ కి వాట్సప్ మెసేజ్ ఎలా చేయాలో తెలుసా?

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్ లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఏడాది అయితే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. వాట్సాప్ లో ఇంకా మరికొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రైవసీ, ఎక్స్పీరియన్స్, మెసేజ్ యువర్ సెల్ఫ్ ఎన్నో ఫీచర్లను లాంచ్ చేసిన వాట్సాప్ సంస్థ ఇంకొన్ని ఫీచర్లను అందుబాటులోకి ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇలా ఉంటే వాట్సాప్ వినియోగదారులకు వాట్సాప్ సంస్థ మరొక గుడ్ న్యూస్ ని తెలిపింది. అదేమిటంటే ఫోన్లో కాంటాక్ట్ సేవ్ చేయకుండానే ఇతరుల నెంబర్ కు వాట్స్అప్ మెసేజ్ చేయవచ్చట.

 

తాజాగా వచ్చిన ఫీచర్ తో కాంటాక్ట్‌ సేవ్‌ చేయకుండానే వాట్సాప్‌ మెసేజ్‌ వాట్సాప్‌ యూజర్లు ఇప్పుడు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇతరుల ఫోన్‌ నంబర్‌ సేవ్‌ చేయకుండానే మెసేజ్‌ పంపవచ్చు. ఎవరైనా తమ ఫోన్ నంబర్‌ ఇచ్చినప్పుడు నంబర్‌ సేవ్‌ చేయడం మర్చిపోయినా లేదా చేయకూడదనుకున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటె కాంటాక్ట్‌ సేవ్‌ చేయకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌ పంపవచ్చు. అయితే ఇలా చేయడానికి లేటెస్ట్‌ అప్‌డేట్‌ మెసేజ్‌ యువర్‌ సెల్ఫ్‌ ఫీచర్‌ అవసరం. మరి నెంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్ లో ఏ విధంగా మెసేజ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా వాట్సాప్‌లో మెసేజ్‌ యువర్‌ సెల్ఫ్‌ ఆప్షన్‌ ద్వారా మెసేజ్‌ పంపాలనుకుంటున్న నంబర్‌ను మీకు మీరే సెండ్‌ చేసుకోవాలి. ఆ తరువాత మీరు బ్లూ కలర్‌లో సెండ్‌ చేసిన ఫోన్‌ నంబర్‌ను చూస్తారు.

 

ఆ నంబర్‌పై ప్రెస్‌ చేసినప్పుడు చాట్‌ విత్ ఫోన్ నెంబర్,వాట్సాప్‌ కాల్, సేవ్‌ కాంటాక్ట్‌ అనే మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అప్పుడు ఆ ఆప్షన్‌లలో చాట్‌ విత్‌ ఆప్షన్‌ పై క్లిక్‌ చేయాలి. వెంటనే కొత్త చాట్ విండో ఓపెన్‌ అవుతుంది. ఈ విండో నుంచి ఆ నంబర్‌కు మెసేజ్‌లు పంపవచ్చు. మెసేజ్‌ యువర్‌ సెల్ఫ్‌ ఎలా పని చేస్తుంది? అన్న విషయానికి వస్తే.. మెసేజ్‌ యువర్‌ సెల్ఫ్‌ ఫీచర్‌ కోసం వాట్సాప్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత వినియోగదారులకు వారి యూజర్‌ నేమ్‌తో ప్రత్యేక చాట్ విండో కనిపిస్తుంది. యూజర్‌ నేమ్‌ పక్కనే యూ అని కూడా ఉంటుంది. ఆ చాట్‌ విండోలో అన్ని రకాల మెసేజ్‌లు సెండ్‌ చేసే అవకాశం ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -