MP Rama Krishna Raju: హూ కిల్ బాబాయ్ అనే సినిమా కూడా రావచ్చు.. జగన్ పై రఘురామ విమర్శలు మామూలుగా లేవుగా!

MP Rama Krishna Raju: ఏపీలో పొలిటికల్ సినిమాలు, రాజకీయ సభల్లో సినిమా డైలాగుల వార్ నడుస్తోంది. టీడీపీ, వైసీపీ మధ్య సినిమా డైలాగులు పేలుతున్నాయి. షర్టు మడతపెట్టే టైం దగ్గర పడిందని జగన్ కార్యకర్తలకు తెలిపారు. చంద్రబాబు కూడా గతంలో ఎన్నడూ లేని హుషారు చూపించారు. వైసీపీ కార్యకర్తలు షర్టులు మడతపెడితే.. టీడీపీ కార్యకర్తలు కుర్చీలు మడతపెడతారని చంద్రబాబు సెటైర్లు వేశారు. ఈ డైలాగ్ వార్ ఇరు పార్టీల నేతల మధ్య నడుస్తోంది.

డైలాగ్ వార్‌తో పాటు ఏపీలో పొలిటికల్ ఫిల్మం వార్ కూడా జోరుగా నడుస్తోంది. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ మద్దతుదారులు.. టీడీపీకి వ్యతిరేకంగా మద్దతుదారులు సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే వ్యూహాం, శపథం పేరుతో ఆర్జీవీ నిసిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇవి జగన్ కు అనుకూలంగా ఉంటాయి. ఇటీవలే యాత్ర 2 కూడా రిలీజ్ అయింది. ఇది కూడా గతంలో జగన్ చేసిన పాదయాత్ర గురించి ఉంటుంది. ఇప్పుడు రాజధాని ఫైల్స్ పేరుతో మరో సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాపై పలువురు కేసులు వేయగా హైకోర్టు ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఎంపీ రఘురామకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు.

ప్రతీ ఒక్కరూ రాజధాని ఫైల్స్ సినిమాను చూడాలని రఘురామకృష్ణంరాజు చెప్పారు. అంతేకాదు.. ఈసినిమా గురించి పలు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈసినిమాలో తను కూడా యాక్ట్ చేయాల్సిందని కానీ.. పలు కారణాల వలన చేయలేకపోయానని చెప్పారు. సీఎం జగన్ అమరావతి రైతులకు ఏరకంగా అన్యాయం చేశారో ఈసినిమాలో చూపించారని తెలిపారు. ఈసినిమా తనకు ఇబ్బందికరంగా మారుతుందని జగన్ కు భయం పట్టుకుందని చెప్పారు. అందుకే కోర్టుకు వెళ్లి సినిమా రిలీజ్ ను అడ్డుకోవాలని ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ వాళ్లు వ్యూహం, శపథం సినిమాలు తీస్తారు కానీ.. వేరే సినిమాలు మాత్రం రానివ్వరని మండపడ్డారు. ఇక, యాత్ర సినిమాపై కూడా రఘురామకృష్ణం రాజు సెటైర్లు వేశారు. ఈసినిమా చూడటానికి ఎవరూ వెళ్లడం లేదని అన్నారు. ప్రైవసీ కోసం కొన్ని జంటలు మాత్రమే వెళ్తున్నాయని సెటైర్లు వేశారు. సినిమాల్లో బాగోకపోతే.. అట్టర్ల ప్లాప్ అంటారు కానీ.. యాత్ర 2 సినిమా అంతకంటే పెద్ద ప్లాప్ అని వ్యంగ్యాస్త్రాలు సందించారు. హూ కిల్ బాబాయ్ అనే సినిమా కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. దీంతో.. నిజంగా వస్తుందా? అన్న చర్చ నడుస్తోంది. నిజంగా ఈ సినిమా వస్తే.. వైఎస్ ఫ్యామిలీలో ఉన్న విభేదాలకు కారణం తెలిసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇంటింటికి చంద్రముఖీ వస్తుందని జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఎంపీ రఘురామ సెటైర్లు వేశారు. అసలు జగన్ కంటే పెద్ద చంద్రముఖీ ఎవరుంటారని ప్రశ్నించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -