Star Heroes: స్టార్ హీరోలు అయినా ఆ విషయంలో దిగులే మిగిలిందిగా?

Star Heroes: సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి వారిలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ఒకరు. అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇలాంటి కోవకే చెందుతారు.ఇద్దరి హీరోలకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు.ఇలా హీరోలుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఇద్దరి హీరోలు వ్యక్తిగత జీవితంలో మాత్రం వీరికి ఒకే విధమైనటువంటి దిగులు బాధ ఉన్నాయని చెప్పాలి.

ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టారు. ఆయనప్పటికీ మనశ్శాంతి అనేది ఏమాత్రం లేదని తెలుస్తోంది.రజనీకాంత్ కు ఇద్దరు కుమార్తెలు కాగా చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. ఇక రజనీకాంత్ ఇద్దరు కుమార్తెలు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కాకుండా ఇతర డిపార్ట్మెంట్లో కొనసాగుతున్నారు. ఇక చిరంజీవి కుమారుడు స్టార్ హీరోగా సక్సెస్ సాధించారు..

 

చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడమే కాకుండా నిర్మాతగా కూడా అడుగుపెట్టారు.చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కారణంగా చిరంజీవి ఎంతో బాధపడుతున్నారు.ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తన కూతురు కారణంగా మెగాస్టార్ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అవుతుంది.శ్రీజ ఇదివరకే రెండుసార్లు పెళ్లి చేసుకుని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చారని తెలుస్తోంది.

 

ఇక రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య కూడా తమ భర్తలకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.ఐశ్వర్య పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత తన భర్త హీరో ధనుష్ కు విడాకులు ఇచ్చే ఒంటరిగా ఉంటూ సినిమాలలో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇక సౌందర్య రజనీకాంత్ సైతం మొదటి భర్తకు విడాకులు ఇచ్చి తిరిగి రెండవ పెళ్లి చేసుకున్నారు.ఇలా ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయినప్పటికీ కూతుర్ల విషయంలో మాత్రం వీరికి దిగులు అనేది అలాగే ఉండిపోయిందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -