Jadcherla: నకిలీ బాబా నిజస్వరూపం బట్టబయలు.. అలాంటి వీడియోలు తీసి?

Jadcherla: రోజురోజుకి టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా సమాజంలో మూఢనమ్మకాలు ఇంకా పోవడం లేదు. ఇంకా కొన్ని ప్రదేశాలలో ఈ మూఢ నమ్మకాలకు చాలామంది బలవుతున్నారు. కొందరు దొంగ బాబాలను నమ్ముకొని వారు చెప్పిన పిచ్చి సలహాలు పాటిస్తూ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక దొంగ బాబా ఆడవారిని మోసం చేసి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను కాజేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని జడ్చర్ల ప్రాంతంలో జైనుల్లబుద్దీన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.


నకిలీ బాబాగా అవతారమెత్తి జైనుల్లబుద్దీన్ అందమైన మహిళలను టార్గెట్ గా పెట్టుకొని వారిని తన మాయ మాటలతో ముగ్గులోకి దింపుకున్నాడు. ఫలానా పూజలు చేస్తే మీ దరిద్రం అంతా పోయి అదృష్టం వస్తుందని, పుట్టుమచ్చలు ఆధారంగా జాతకాలు చూస్తానని చెప్పి వారిని పిచ్చి వారిని చేసి వారిని నమ్మించాడు. అంతటితో ఆగని దుర్మార్గుడు మహిళలను నమ్మించి నగ్నంగా పూజలు చేయడంతో పాటు ఆ వీడియోలు కూడా తీసుకునేవాడు. అలా తీసుకున్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజినట్లు కూడా బాధితులు తెలిపారు.

ఈ నకిలీ బాబా అసలు నిజస్వరూపం వెలుగు లోకి రావడంతో కొందరు స్థానికులు అతడి పాడుపనులను ప్రశ్నించగా ఆ దుర్మార్గుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆ నకిలీ బాబాను స్థానికులంతా చితకబాది చివరికి ఆ తరువాత పోలీసులకు అప్పగించాడు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -