Warangal: బయటపడ్డ దొంగ స్వామీజీ నిజస్వరూపం.. స్త్రీలను లోబరుచుకొని ఆపై?

Warangal: రోజురోజుకీ ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు మానభంగాలు, మానసిక వేధింపులు హత్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో రకాల చట్టాలను తీసుకువచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలకు మాత్రం సరైన అడ్డుకట్ట వేయలేకపోతోంది. కామాంధులను సరైన విధంగా శిక్షించకపోవడంతో ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోతున్నారు. దీంతో కామాంధుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిత్యం పదుల సంఖ్యలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతమంది దుర్మార్గులు ఆడవారి అవసరాలను ఆసరాగా తీసుకొని వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు.

మహిళలను వేధించడం కోసం మారువేశాల్లో కూడా వస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్వామీజీ పేరుతో దొంగ నాటకాలు ఆడుతూ ఆడవారిపై అత్యాచారాలకు ఒడిగట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో దొంగ స్వామీజీ బాగోతం కూడా బయటపడింది. ఈ ఘటన వరంగల్ లో వెలుగులోకి వచ్చింది. వరంగల్ లో ఒక మంత్రగాడు కుటుంబ సమస్యలను పరిష్కారం చెబుతానని అలాగే భార్య భర్తల మధ్య తగాదాలు, ఇంకా ఎవరైనా ఆ ఊర్లో ఉండే పిల్లకు కానీ పెద్దలకు ఆరోగ్య సమస్యలు వచ్చినా పరిష్కారం చేస్తానంటూ ఊర్లో ఉన్న చుట్టు పక్కల వారందరినీ నమ్మించుకుంటూ జీవనం సాగించేవాడు.

అలా కొన్ని రోజులు అందరిని చూస్తూ, నమ్మించి ఫేమస్ అయిపోయాడు. అయితే ఇప్పుడిప్పుడే తన అసలు విశ్వరూపం బయటకి వచ్చింది. అతడి మాయమాటలు నిజమే అని నమ్మి అతని నిజమైన స్వామీజీ అనుకున్నా చాలా మంది అతని దగ్గరకు వెళ్ళగా అలా కుటుంబ సమస్యలతో వచ్చిన మహిళలు, యువతులను భయపెట్టించి, మాయ.మాటలు చెప్పి యువతులను లోబర్చుకొని అత్యాచారాలు చేసుకుంటూ వచ్చాడు. ఆ క్రమంలోనే ఒక మహిళ తన భర్తతో ఉన్న విభేదాలను పరిష్కారించాలంటూ గత కొన్నిరోజుల క్రితం ఒక మహిళ దొంగ బాబా లబ్బేను సంప్రదించింది. అతను పూజలు చేస్తున్నట్టు నటించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ విషయాన్ని వెంటనే ఆమె ఇంట్లో చెప్పింది.

ఆమె చెప్పగానే భాదితురాలితో పాటు, ఆమె కుటుంబ సభ్యులు టాస్క్ ఫోర్స్ పోలీసులను కలవడంతో దొంగ బాబా బాగోతం అంతా బయటపడింది. ఆ దొంగ బాబా నుంచి రూ.25 వేల నగదుతో పాటుగా తాయత్తులు, వన మూలికలు, దారాలు, నిమ్మకాయలు, నూనె డబ్బాలు, ఇలా పలు రకాల వస్తువులను స్వాదీనం చేసుకున్నారు. కాగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎం జితేందర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన షైక్నాలా లబ్బే దొంగ బాబా దాదాపు 40 సంవత్సరాల కిందటనే వరంగల్ నగరానికి వచ్చాడు. ఆ క్రమంలోనే ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్ట్ సమీపంలో నివాసం ఉంటూ బాబా ఈ అవతారమెత్తాడు. తనకు వచ్చిన మంత్ర శక్తులను ఉపయోగించి కుటుంబ కలహాలు, భార్యభర్తల మధ్య గొడవలు, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పరిష్కారం చెబుతానంటూ అక్కడ చుట్టు పక్కల ఉన్న వారందరిని నమ్మించి ఇలా పలువురు మహిళలని, యువతులను నమ్మించి లోబర్చుకున్నట్లు వారు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -