Kajal: లావైన కాజల్.. ఈ ఫోటోలు చూస్తే అస్సలు గుర్తు పట్టలేమంటూ?

Kajal: టాలీవుడ్ లో అందరి అభిమానాన్ని చూరగొన్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. అందమైన కాజల్ ఇప్పుడు తన లేటెస్ట్ లుక్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అవి కాస్తా ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నాయి. ఈ స్టార్ హీరోయిన్ కాస్త బరువు పెరిగి లావైనట్లుగా కనిపిస్తోంది. కాస్త శ్రద్ధ తీసుకోకపోతే మాత్రం ఆమె షేప్ అవుట్ అవుతారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

 

మహిళల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. మోడ్రన్ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు ఊబకాయానికి కూడా కారణం అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత స్లిమ్ బాడీని మెయింటెయిన్ చేయడం అంత సులభం కాదు. కాజల్ అగర్వాల్ ఇప్పుడు అదే సమస్యతో బాధపడుతోంది. 2020లో కాజల్ అగర్వాల్ కు పెళ్లి అయ్యింది. ప్రస్తుతం ఆమె తల్లి అయ్యి పండండి బాబుకు జన్మనిచ్చింది. తన కొడుక్కి కాజల్ గౌతమ్ కిచ్లు అనే పేరును కూడా పెట్టారు. తల్లిగా తన బాధ్యతను చూస్తున్న కాజల్ గత కొంత కాలంగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటున్నారు.

 

తల్లి అయిన తర్వాత కాజల్ బరువు పూర్తిగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఆమె లేటెస్ట్ ఫోటోస్ చూస్తేనే అర్థమవుతుంది. కాజల్ లావు అవ్వడంతో ఫ్యాన్స్ ఆమెను స్లిమ్ అవ్వాలని కోరుతున్నారు. మునుపటి కాజల్ లా ఆమెను మారిపోమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీవితంలో అన్నింటికంటే గొప్ప విషయం తల్లి అవ్వటం. కాబట్టి బరువు పెరిగినందుకు కాజల్ అగర్వాల్ బాధపడాల్సిన పనిలేదు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.

 

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ భారతీయుడు2 సినిమాలో చేస్తున్నారు. అయితే వివాదాల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగింది. కానీ ఈ మధ్యనే తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. భారతీయుడు2 సినిమాలో కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ మరో హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమా అటు తెలుగు, ఇటు తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -