Kajal: ఆ విషయాలు పచ్చిగా చెప్పేసిన కాజల్ అగర్వాల్.. ఏం జరిగిందంటే?

Kajal: లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ పెళ్లి చేసుకుని ఓ బిడ్డకి తల్లి కూడా అయింది. ఈ మధ్యనే తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. అందుకే తన పేరు మరోసారి టాప్ ఉండటం కోసం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. అభిమానులకు తగినంత అప్డేట్ ఇస్తూ వాళ్లకి మరింత ఎంటర్టైన్ ఇస్తుంది.

ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఒక సెషన్ కండక్ట్ చేసింది. దాంతో రెచ్చిపోయిన కాజల్ అభిమానులు రకరకాల ప్రశ్నలు వేశారు. ఉదయం లేవగానే బెడ్ పై ముందుగా మీరు ఏం చేస్తారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె చాలా ఓపికగా సమాధానం చెప్పింది పొద్దున్న లెగుస్తూనే నా బిడ్డకి నా భర్తకి ఒక హాగ్ ఇచ్చి ముద్దు పెడతాను.

 

తర్వాత కాస్త హాట్ వాటర్ లో లెమన్ జ్యూస్ కలుపుకొని తాగుతాను. కొన్ని మంత్రాలు దేవుడి పాటలు వింటాను. ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను తర్వాత బేబీకి ఫీడ్ చేస్తాను.. షూటింగ్ ఉంటే మళ్లీ అటు పరిగెడతాను అంటూ చాలా ఓపికగా సమాధానం చెప్పింది కాజల్. ఈ సమాధానం విన్న కొందరు డిజైన్స్ చెప్పింది అని ట్రోలింగ్ చేస్తున్నారు.

 

నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆ అదృష్టం 2 ఏళ్ల క్రితం వేరే వాళ్ళకి దక్కింది అంటూ సరదాగా కౌంటర్ వేసింది కాజల్. అలాగే బన్ని మీద తన అభిప్రాయాన్ని చెప్పమని అడిగిన ఒక నెటిజన్ కి నేను వర్క్ చేసిన హీరోలలో నాకు నచ్చిన ఫస్ట్ వ్యక్తి అల్లు అర్జున్ ఆయన ఎనర్జీని ఎంతగానో ఇష్టపడతాను.

 

ఆయనతో డాన్స్ చేయడం నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది కాజల్. ఆమె సింపుల్ సిటీకి కొందరు ఫిదా అవుతుంటే ఆమె చెప్పిన బోల్డ్ సమాధానానికి కొందరు పెదవి విరుస్తున్నారు. ఇక ఈమె బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -