Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి ఈమెపై విమర్శలు చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి పేపర్లలో ఇద్దరిని గవర్నమెంట్ తొలగించారు. దీంతో బిఆర్ఎస్ నాయకులు గవర్నర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో గవర్నర్ తమిళసై రాళ్లు వేస్తే ఆ రాళ్లతో ఇల్లు కట్టుకుంటానని, తనపై దాడి చేస్తే ఆ రక్తాన్ని సిరగా మార్చుకొని చరిత్ర రాసుకుంటారని ఈమె తెలియజేశారు. తాను తెలంగాణలో అడుగు పెట్టకు ముందు వరకు ఇక్కడ ఒక మహిళకు కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదు తాను వచ్చిన తర్వాతే మహిళలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారని తెలిపారు.

ప్రోటోకాల్ కి గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతానని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలకు తమిళ సై తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఇక ఈమె తిరస్కరించినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులలో కుర్ర సత్యనారాయణ దాసోజు శ్రవణ్ పేర్లను తొలగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 (5) ఆ ఇద్దరు ఎమ్మెల్సీలకు అనర్హులంటూ ఈమె ప్రభుత్వానికి లేఖ రాశారు ఇలా ఇద్దరిని అనర్హులుగా ప్రకటిస్తూ తమిళసై తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పై టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై విమర్శలు చేశారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -