Tamilisai Soundararajan: గవర్నర్ తమిళి సై సంచలన నిర్ణయం.. కేసీఆర్ తో సై

Tamilisai Soundararajan:తెలంగాణ విమోచనం దినోత్సవం వేదిక చుట్టూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంపై రాజకీయాలు కాక రేపుతోన్నాయి. పోటాపోటీగా పార్టీలన్నీ విమోచన దినోత్సవాన్ని గ్రాండ్ గా జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. విమోచన దినోత్సవాన్ని రాజకీయంగా వాడుకోవాలని లబ్ధి పోందాలని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు పెరెడ్ గ్రౌండ్స్ లో వేడుకలు సన్నాహాలు చేస్తోంది.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దగ్గర ఉండి విమోచన దినోత్సవ ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ వేడుకులకు రానున్నారు. ఇక టీఆర్ఎస్ కూడా అధికారికంగా విమోచన దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఆ రోజు కేసీఆర్ వేడుకల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక కాంగ్రెస్, మితగా పార్టీలు కూడా విమోచన దినోత్సవాలు జరపున్నాయి. దీంతో సెప్టెంబర్ 17న ఏ జరగబోతుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అమిత్ షా రానుండటంతో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి విమర్శలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

పోటీపోటీగా విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుండటంతో సెప్టెంబర్ 17న రాజకీయ వేవి మరింత పెరిగే అవకాశముంది. అయితే ఈ క్రమంలో గవర్నర్ తమిళి సై కూడా ఇందులోకి వచ్చారు. తాజాగా ఆమె సంచలన ప్రకటన చేశారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవ వేడుకులను రాజ్ భవన్ లో నిర్వహించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఉద్యమ పోరాటాలు.. త్యాగాలు అనే అంశంపై విశ్వవిద్యాలయ విద్యార్థులతో వ్యకృత్వ పోటీలు నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 17న మధ్యామ్నం 2 గంటల నుంచి వ్యక్తృత్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనాల్సిన విద్యార్థులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రైజ్ మనీ కూడా ప్రకటించనున్నారు. పోటీల్లో గెలిచిన మొదటి ముగ్గురు విద్యార్థులకు ప్రైజ్ మనీ గవర్నర్ అందించనున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వానికి పోటీగా ఏకంగా గవర్నర్ రాజ్ భవన్ లో విమోచన దినోత్సవాన్ని జరపనుండటం ఉత్కంఠ రేపుతోంది. దీంతో సెప్టెంబర్ 17పై తెలంగాణ రాజకీయాల్లో టెన్షన్ నెలకొంది.

గత కొంతకాలంగా కేసీఆర్, గవర్నర్ మధ్య విబేధాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో అసలు రాజ్ భవన్ ముఖమే కేసీఆర్ చూస్తున్నారు. ఇక కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు గవర్నర్ ప్రయత్నాలు చేశారు.

రాజ్ భవన్ లో ప్రజాదర్భార్ ఏర్పాటు చేసిన గవర్నర్.. మహిళా సమస్యలను తెలుసుకున్నారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్ భవన్ లోనే విమోచన దినోత్సవ వేడకలు జరపడం కలకలం రేపుతోంది. దీంతో కేసీఆర్ తో పోరుకు గవర్నర్ సిద్దమైనట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -