Hansika Motwani: హన్సికకు అలాంటి గిఫ్ట్.. భర్త ప్రేమకు ఫిదా కావాల్సిందే!

Hansika Motwani: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే హన్సిక లవ్ షాదీ డ్రామా సీజన్ లో ఒక్కో ఎపిసోడ్‌ ప్రతీవారం రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రతీ ఎపిసోడ్ లో ఏదో ఒక సస్పెన్స్ తో ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నారు. ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా ది ఫేరి టేల్ వెడ్డింగ్ అనే టైటిల్ తో హన్సిక లవ్ షాదీ డ్రామా ఆరవ ఎపిసోడ్‌ తాజాగా విడుదల అయింది.‌ దీనిలో అందరూ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ ల గురించి మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారు.

అదే సమయంలో పెళ్ళిలో ప్రభుదేవా సాంగ్ ప్లే చేసారు. దానికి సోహెల్ వెళ్ళి డ్యాన్స్ వేయగా హన్సిక వావ్ అంటూ ఆశ్చర్యపోయింది. ‌నా కోసం చాలా కష్టపడ్డాడు సోహెల్. అసలు ఊహించలేదు డ్యాన్స్ అంత బాగా చేస్తాడని, నాకు సర్ ప్రైజ్ కాంబో ఇచ్చాడు అని తెలిపింది హన్సిక. ఆ తర్వాత సంగీత్ లో‌ డ్యాన్స్ ‌మొదలైంది.‌ మొదట తన ఫ్రెండ్స్ డ్యాన్స్ చేయగా, మెల్లిగా ఆ డ్యాన్స్ లోకి ఆంటి‌, అంకుల్ చేరారని హన్సిక‌ చెప్పగా.. మా‌ డాడ్ ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు మొదటిసారి వారి డాన్స్ చూశాను అని తెలిపాడు సోహెల్. ఆ తర్వాత హన్సిక వాళ్ళ‌ బ్రదర్ ప్రశాంత్ డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. అయితే మధ్యలో తను కొన్ని‌ స్టెప్స్ మర్చిపోయాడు.

 

వెంటనే తన వైపు చూసి అయిపోయాను అన్నట్టు ఫేస్ పెట్టాడని వెంటనే నేను(హన్సిక), అమ్మ‌ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళగా ప్రశాంత్ మా ఇద్దరిని చూసి ఎమోషనల్ అయ్యి ఏడ్చేసాడు అని హన్సిక చెప్పుకొచ్చింది. వీళ్ళు ముగ్గురు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని సోహెల్ చెప్పగా..ఇప్పుడు నలుగురం అయ్యాం అని హన్సిక తెలిపింది. కాగా హన్సిక విషయానికి వస్తే.. హన్సిక అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -