Hansika-Bunny: చెప్పినా వినకుండా పబ్ లో హన్సికతో అలా చేసిన బన్నీ.. అసలేం జరిగిందంటే?

Hansika-Bunny: హన్సిక మోత్వాని పరిచయం అవసరం లేని పేరు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె అనంతరం హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హన్సిక మొట్టమొదటిసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దేశముదురు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అల్లు అర్జున్ హన్సిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి.

ఇలా మొదటి సినిమాతోనే తెలుగులో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హన్సిక అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు. ఇక తమిళంలో కూడా అవకాశాలను అందుకొని తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినటువంటి హన్సిక పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 

ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె నటించిన మొదటి సినిమా దేశముదురు గురించి పలు విషయాలను తెలియచేశారు. దేశముదురు సినిమా షూటింగ్ సమయంలో తనకు 15 సంవత్సరాలు వయసు మాత్రమేనని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా 16వ సంవత్సరంలోకి అడుగు పెట్టానని అయితే నా పుట్టినరోజు సందర్భంగా సెట్లోనే తనకు బర్త్డే సెలబ్రేషన్స్ చేశారని తెలియజేశారు.

 

ఇక నా బర్తడే అని తెలియడంతో అల్లు అర్జున్ పూరి సర్ ఇద్దరు కూడా తనని బలవంతంగా పబ్ కి తీసుకు వెళ్లారని తెలిపారు. అక్కడికి వెళ్లి నేను సైలెంట్ గా కూర్చుని ఉండగా పూరి సర్ నాతో ఏవేవో తాగించు బలవంతంగా నాతో డాన్స్ కూడా చేయించారని ఈమె తెలియజేసారు అయితే అప్పటివరకు నేను ఒక్కసారి కూడా పబ్ కి వెళ్లలేదు నా పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సర్ పూరి సర్ నన్ను తీసుకెళ్లారని ఈ సందర్భంగా హన్సిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -