Siva Jyothi: శివజ్యోతి భర్తపై దారుణమైన కామెంట్లు. అసలేమైందంటే?

Siva Jyothi: శివ జ్యోతి పరిచయం అవసరం లేని పేరు తీన్మార్ వార్తల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ జ్యోతి ప్రస్తుతం బుల్లితెర తెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ ఛానల్ కోసం పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ ఉన్నారు.తీన్మార్ వార్తలు ద్వారా తెలంగాణ యాసాలో గడగడా మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శివజ్యోతి ఈ కార్యక్రమం అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలలో తన భర్త గంగూలితో కలిసి సందడి చేశారు.ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా బిజీగా ఉండడమే కాకుండా ఈమె పేరున ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల వీడియోలను ఈమె అభిమానులతో పంచుకున్నారు.

 

ఇలా వరుస వీడియోల ద్వారా నిత్యం అభిమానులను సందడి చేసే ఈమె బోనాల పండుగ సందర్భంగా తన భర్త తనకు బంగారం కొనిచ్చాడు అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ వీడియో చూసిన తర్వాత కొందరు నెటిజెన్స్ శివ జ్యోతి భర్త గురించి దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈ వీడియోని చూసినటువంటి అభిమానులు అక్క అని పిలుస్తూనే మీ భర్త ఏం చేస్తారు అంటూ ప్రశ్నించారు అయితే ఈ ప్రశ్నకు మరొక నేటిజన్స్ స్పందిస్తూ సమాధానం చెప్పారు.

 

ఆమె భర్త ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు అంటూ కామెంట్ చేశారు. అంతేకాకుండా మరికొందరు మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు అంటూ కూడా వీరి గురించి కామెంట్ చేశారు.అయితే ఇవన్నీ కూడా వారి వ్యక్తిగత విషయాలు అయినప్పటికీ ఇలా నేటిజన్స్ కామెంట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే శివ జ్యోతిని పెళ్లి చేసుకున్న సమయంలో గంగూలి జాబ్ చేసేవారు కానీ ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన వీడియోల పనిచేస్తూ ఈయన తన ఉద్యోగానికి రిజైన్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -